Rashmika | ర‌ష్మిక ఏంటి ఇంత పెద్ద షాకిచ్చింది.. ఎప్పుడో పెళ్లైందంటూ భ‌ర్త పేరు కూడా రివీల్ చేసిన క‌న్న‌డ భామ‌

Rashmika: కూర్గ్ బ్యూటీ ర‌ష్మిక మందన్నా ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఎంతో మంది అభిమానుల మ‌న‌సుని గెలుచుకుంది ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న ర‌ష్మిక ఆ త‌ర్వాత స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ మంచి హిట్స్ అందుకుంది.ఈ క్ర‌మంలోనే పుష్ప సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న న‌టించి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. ర‌ష్మిక ఇప్పుడు తెలుగులోనే కాకుండా త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేస్తుంది. అయితే ర‌ష్మిక హిందీ సినిమాల‌కి పెద్ద‌గా […]

  • By: sn |    latest |    Published on : Aug 03, 2023 9:02 AM IST
Rashmika | ర‌ష్మిక ఏంటి ఇంత పెద్ద షాకిచ్చింది.. ఎప్పుడో పెళ్లైందంటూ భ‌ర్త పేరు కూడా రివీల్ చేసిన క‌న్న‌డ భామ‌

Rashmika: కూర్గ్ బ్యూటీ ర‌ష్మిక మందన్నా ఇప్పుడు నేష‌న‌ల్ క్ర‌ష్‌గా ఎంతో మంది అభిమానుల మ‌న‌సుని గెలుచుకుంది ఛ‌లో సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు దోచుకున్న ర‌ష్మిక ఆ త‌ర్వాత స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటూ మంచి హిట్స్ అందుకుంది.ఈ క్ర‌మంలోనే పుష్ప సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న న‌టించి పాన్ ఇండియా హీరోయిన్‌గా ఎదిగింది. ర‌ష్మిక ఇప్పుడు తెలుగులోనే కాకుండా త‌మిళం, హిందీ భాష‌ల‌లో ప‌లు సినిమాలు చేస్తుంది. అయితే ర‌ష్మిక హిందీ సినిమాల‌కి పెద్ద‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు కాస్త నిరాశ‌లో ఉంది.

ర‌ష్మిక ఇటీవ‌ల సోష‌ల్ మీడియా ద్వారా త‌న అందాల ఆర‌బోత చేస్తూ ర‌చ్చ చేస్తుంది. ఇక ప్రైవేట్ ఈవెంట్స్‌కి హాజ‌ర‌య్యే ర‌ష్మిక అందాలు మొత్తం ఆర‌బోస్తూ హాట్ టాపిక్‌గా మారుతుంది.ఇక ర‌ష్మిక గ‌త కొద్ది రోజులుగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ప్రేమాయ‌ణంలో ఉంద‌నే టాక్ వినిపిస్తుంది. దీనిపై ఎంత ప్ర‌చారాలు సాగుతున్నా కూడా వారు మాత్రం క్లారిటీ ఇవ్వ‌డం లేదు. అయితే కొన్ని రోజుల ముందు ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్‌లో హోస్ట్ సరదాగా అడిగిన ప్రశ్నలకు తాను ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

పెళ్లి గురించి ర‌ష్మిక మాట్లాడుతూ.. ఇప్ప‌టికే నాకు నరుటోతో పెళ్లి అయిపోయింది ..నా మనసులో ఇప్పుడు అతడే ఉన్నాడు” అంటూ రష్మిక ఆస‌క్తిక‌ర‌ కామెంట్స్ చేసింది. ర‌ష్మిక న‌రుటో అని పేరు చెప్ప‌డగానే జనాలు సైతం షాక్ అయిపోయారు . నరుటో అంటే ఎవరో తెలియని వాళ్ళు ఆరా తీయ్యడం మొదలుపెట్టారు . అయితే నరుటో ఎవ‌రంటే ఎనిమి సిరీస్ లో ఒక పాత్ర పేరు . ఈ పాత్ర‌కి కేవలం రష్మిక మందన్నానే కాదు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు . రష్మిక కూడా ఆ పాత్ర‌కు బాగా అడిక్ట్ అయింది. క‌నెక్ట్ అయితే ప‌ర్లేదు.. ఆ పాత్ర‌తో త‌న పెళ్లి జ‌రిగింద‌ని చెప్ప‌డంతో ఒక్కసారి అభిమానులు గుండె ఆగిపోయినంత పని అయింది. అస‌లు విష‌యం తెలుసుకొని రిలాక్స్ అవుతున్నారు..