Rashmika | ఇప్ప‌టి నుంచి చీరలే క‌డుతా: ర‌ష్మిక

Rashmika | ఛ‌లో సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ స్టేట‌స్ అందుకుంది. పుష్ప సినిమాతో ర‌ష్మిక‌కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ద‌క్క‌గా, ఆ త‌ర్వాత ప‌లు బాలీవుడ్ చిత్రాల‌లో న‌టించి మెప్పించింది. అయితే తెలుగులో వ‌చ్చిన‌న్ని హిట్స్ ర‌ష్మిక‌కి […]

  • Publish Date - September 11, 2023 / 02:30 PM IST

Rashmika |

ఛ‌లో సినిమాతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ఆ త‌ర్వాత వైవిధ్య‌మైన ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది ర‌ష్మిక‌. ప్ర‌స్తుతం స్టార్ హీరోల స‌ర‌స‌న అవ‌కాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ భామ తెలుగులో తక్కువ సమయంలోనే స్టార్ స్టేట‌స్ అందుకుంది.

పుష్ప సినిమాతో ర‌ష్మిక‌కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ద‌క్క‌గా, ఆ త‌ర్వాత ప‌లు బాలీవుడ్ చిత్రాల‌లో న‌టించి మెప్పించింది. అయితే తెలుగులో వ‌చ్చిన‌న్ని హిట్స్ ర‌ష్మిక‌కి హిందీలో రావ‌డం లేదు. ప్ర‌స్తుతం పుష్ప‌2, యానిమ‌ల్ చిత్రాల‌తో పాటు మరి కొన్ని చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. వీటిపై భారీ అంచనాలే పెట్టుకుంది ర‌ష్మిక‌.

సినిమాలు, ఇత‌ర కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉండే ర‌ష్మిక ఇటీవ‌ల త‌న అసిస్టెంట్ పెళ్లికి హాజ‌రై సంద‌డి చేసింది. రష్మిక మందన్న అసిస్టెంట్‌ సాయి వివాహం హైదరాబాద్‌లోని బహదూర్‌పల్లిలో జర‌గ‌గా, ఆ వివాహ వేడుక‌కి హాజ‌రై అంద‌ర‌ని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది ర‌ష్మిక‌.

అయితే త‌న పెళ్లికి ర‌ష్మిక వంటి స్టార్ హీరోయిన్ హాజరు కాగా, ఆనందంతో ఉప్పొంగిపోయిన సాయి అత‌ని భార్య ర‌ష్మిక కాళ్ల‌పై ప‌డి ఆశీర్వాదం అందుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేశాయి. అయితే పెళ్లి వేడుక‌కి ర‌ష్మిక ఆరెంజ్ క‌ల‌ర్ శారీ ధ‌రించి స్లీవ్‌లెస్ బ్లౌజ్ ధ‌రించింది. ఆమె శారీ లుక్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ట్టుకుంది.

తాజాగా ర‌ష్మిక త‌న శారీ లుక్ పిక్ సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇప్ప‌టి నుండి నేను ఇక శారీలు ఎక్కువ‌గా క‌ట్టాల‌ని అనుకుంటున్నాను. అవి చాలా కంఫ‌ర్ట్‌గా అనిపిస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు అంటూ పోల్ కూడా పెట్టింది.

దీనికి నెటిజ‌న్స్ నుండి భిన్న‌మైన రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. ఇక ఈ చీర ధర సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మార‌గా, సుమారు 35 వేలు ఉంటుందని స‌మాచారం. ఇక ర‌ష్మిక త్వ‌రలో ‘రెయిన్‌బో’ చిత్రాలతో పాటు శేఖర్‌ కమ్ముల-ధనుష్‌ సినిమాలో కథానాయికగా నటించ‌నుంది.

Latest News