Bigg Boss7 | వీరంగం సృష్టించిన ర‌తిక‌.. అంద‌రి అటెన్ష‌న్ కోసం అంటూ ష‌కీలా కామెంట్స్

Bigg Boss7 | బిగ్ బాస్ సీజీన్ 7 అంతా ఉల్టా పుల్టా. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్తితి. ఎవ‌రు ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో, ఎవ‌రు ఏం చేస్తారో అర్ధం కాని ప‌రిస్థితి. మెల్లిగానే టేకాఫ్ అయిన ఈ షో.. వీకెండ్స్‌లో.. నామినేషన్లో మాత్రం పీక్స్‌కి వెళుతుంది.తాజాగా ర‌తిక బిగ్ బాస్ హౌజ్‌లో వీరంగం సృష్టించింది. ప్ర‌స్తుతం మాయాస్త్రం కోసం హౌజ్ మేట్స్ మహాబలి, రణధీరా రెండు సమూహాలుగా విడిపోయి ఆట ఆడుతున్న విష‌యం తెలిసిందే. […]

  • Publish Date - September 15, 2023 / 01:39 AM IST

Bigg Boss7 |

బిగ్ బాస్ సీజీన్ 7 అంతా ఉల్టా పుల్టా. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అర్ధం కాని ప‌రిస్తితి. ఎవ‌రు ఎప్పుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో, ఎవ‌రు ఏం చేస్తారో అర్ధం కాని ప‌రిస్థితి. మెల్లిగానే టేకాఫ్ అయిన ఈ షో.. వీకెండ్స్‌లో.. నామినేషన్లో మాత్రం పీక్స్‌కి వెళుతుంది.తాజాగా ర‌తిక బిగ్ బాస్ హౌజ్‌లో వీరంగం సృష్టించింది. ప్ర‌స్తుతం మాయాస్త్రం కోసం హౌజ్ మేట్స్ మహాబలి, రణధీరా రెండు సమూహాలుగా విడిపోయి ఆట ఆడుతున్న విష‌యం తెలిసిందే.

అయితే గురువారం ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఒక ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్‌లో అస్త్రాలు ఎవ‌రెవ‌రి ద‌గ్గ‌ర ఉన్నాయో మీ అంద‌రికి తెలుసు, ఆ అస్త్రం సాధించే అర్హ‌త లేని వారి ద‌గ్గ‌ర నుండి భాగాలు తీసుకొని అదే టీంలో ఇత‌ర స‌భ్యుడికి ఇవ్వాలంటూ బిగ్ బాస్ ఆదేశాలు జారీ చేశారు.

దీంతో ముందుగా రంగంలోకి దిగిన శుభశ్రీ.. శోభా శెట్టి నుంచి అస్త్రం భాగాన్ని తీసుకొని యావర్ కి అందించింది. ఆ త‌ర్వాత పల్లవి ప్రశాంత్ అమర్ నుంచి అస్త్రం తీసుకొని శివాజీకి అందించారు. ఈ మ‌ధ్యలో రతిక భీబ‌త్సం స‌ష్టించింది. త‌న టీమ్ మేట్స్‌తో పెద్ద యుద్ధ‌మే చేసింది. పూర్తిగా సహనం కోల్పోయిన ర‌తిక గట్టిగా కేకలు వేస్తూ దామినిపై విరుచుకు ప‌డింది.

దీంతో ర‌తిక బుర్ర‌లేని చైల్డ్ అంటూ దామిని కన్నీరు పెట్టుకుంది. బ‌య‌ట అంద‌రు మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో ర‌తిక‌.. ఇలాంటి టీమ్‌లో ఉన్నందుకు నాకు చాలా ఛండాలంగా అనిపిస్తుంది అంటూ ఫుల్ ఫైర్ అయింది. నా టీంలో ఉన్న‌వాళ్లంద‌రు బ‌ఫూన్స్ అంటూ దారుణంగా మాట్లాడింది.

ఈ క్ర‌మంలో మహాబలి సమూహంలోని కంటెస్ట్స్ అందరూ.. రతికకి యాంటీ అయ్యారు. ఆ స‌మ‌యంలో సందీప్ వారి మ‌ధ్య గొడ‌వ స‌ద్దుమ‌ణిగేలా చేశాడు. ర‌తిక కంటెంట్ కోసమే ఇలా చేస్తుంది అని షకీలా పేర్కొంది.

ఆ త‌ర్వాత దామిని.. ప్రియాంక నుంచి పవరాస్త్రను తీసుకుని షకీలాకు ఇచ్చింది. షకీలా పర్ఫర్మెన్స్ సూపర్‌గా అనిపించిన కార‌ణంతోనే ఆ అస్త్రను ఆమెకి ఇచ్చానంటూ దామిని రీజన్ చెప్పింది. ఇక టాస్క్‌లో మళ్లీ లాస్ట్‌ లో వెళతాని రతిక మొండిగా వాదించ‌డంతో శివాజీ.. నన్ను బిగ్ బాస్ నుంచి పంపడ్రో అంటూ కాస్త కామెడీ చేసే ప్ర‌య‌త్నం చేశాడు.

ర‌తిక ప్ర‌వ‌ర్త‌న వ‌ల‌న ఆమెపై గౌత‌మ్ కూడా సీరియ‌స్ అయ్యాడు. ఇక ఈ తతంగం మొత్తాన్ని గ‌మనిస్తున్న బిగ్ బాస్ ఇచ్చిన టైంలో టాస్క్‌ కంప్లీట్ చేయకపోవడంతో.. మహాబలి టీం పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తారు. మొత్తానికి ర‌తిక ర‌చ్చ‌తో గురువారం ఎపిసోడ్ ముగిసింది.

Latest News