RBI | రూ. 2 వేల నోటు రద్దు.. ప్రజలకు ఆర్‌బీఐ కీలక సూచనలు..
RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 వేల నోటును ఉపసంహరిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రజల వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని సూచించింది. అయితే ఈ సందర్భంగా ఆర్‌బీఐ […]

RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2 వేల నోటును ఉపసంహరిస్తూ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. క్లీన్ నోట్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. ప్రజల వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ఈ నెల 23వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చని సూచించింది. అయితే ఈ సందర్భంగా ఆర్‌బీఐ ప్రజలకు పలు కీలక సూచనలు చేసింది.
కీలక సూచనలు ఇవే..
- రూ. 2 వేల నోట్ల చెల్లుబాటు (లీగల్ టెండర్) సెప్టెంబర్ 30వ తేదీ వరకు కొనసాగుతుంది. కాబట్టి ప్రజలు తమ అవసరాల కోసం నోటును వినియోగించుకోవచ్చు. చెల్లింపుల కింద కూడా స్వీకరించొచ్చు.
- తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను సెప్టెంబర్ 30వ తేదీ లోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలి. లేదా ఇతర నోట్లలోకి మార్చుకోవచ్చు.
- ప్రస్తుత సూచనలు, కేవైసీ వంటి చట్టబద్దమైన నిబంధనలకు లోబడి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ నోట్లను సాధారణంగానే బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చు.
- ఏ బ్యాంకు శాఖలోనైనా, ఒక లావాదేవీలో రూ. 20 వేల వరకు రూ. 2 వేల నోట్లను ఇతర నోట్లోకి ఎటువంటి రుసుము లేకుండా మార్చుకోవచ్చు.
- దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ 19 ప్రాంతీయ కార్యాలయాల వద్ద కూడా ఒక్కోసారి రూ. 20 వేల విలువ వరకు రూ. 2 వేల నోట్లను మార్చుకోవచ్చు.
- బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా కూడా రోజుకు రూ. 4 వేల విలువ వరకు ఒక ఖాతాపై రూ. 2000 నోట్లను మార్చుకునే వీలుంది.