6.31 లక్షల కేసుల బీర్లు ఖాళీ
న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ఊరూ, వాడ సందడి కొనసాగింది. ముక్క, చుక్కతో చిందులేసిన వారికి కొదవేలేదు

- న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో తెగ తాగేశారు..
- తెలంగాణలో మూడు రోజుల్లో రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు
విధాత: న్యూఇయర్ సెలబ్రేషన్స్ అంబరాన్నంటాయి. తెలంగాణ వ్యాప్తంగా ఊరూ, వాడ సందడి కొనసాగింది. ముక్క, చుక్కతో చిందులేసిన వారికి కొదవేలేదు. ఇక బీర్లను కుమ్మేశారు. మద్యం అమ్మకాల వేళల్లో కూడా ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో మరింత కలిసొచ్చింది. పాత ఏడాదికి వీడ్కోలు పలికేందుకు డిసెంబర్ 31 ఆదివారం కావడంతో మరింత ఉత్సాహం నింపుకున్నారు. మధ్యాహ్నం నుంచే మందుబాబులు వైన్ షాపుల వద్ద క్యూకట్టారు. ఆరోజు మద్యం విక్రయాలు అనూహ్యంగా పెరిగిపోయాయి.
డిసెంబరు 29, 30, 31 తేదీల్లో తెలంగాణలో ఏకంగా రూ.658 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు సమాచారం. రాత్రి ఒంటి గంట వరకు సెలబ్రేషన్స్ కు ప్రభుత్వం అనుమతివ్వడం, మరోవైపు వైన్ షాపులు, పబ్బులు, క్లబ్బులను అర్ధరాత్రి వరకు కొనసాగించడంతో మద్యం ఏరులైపారింది. మూడు రోజుల్లో 6.31 లక్షల కేసుల బీర్లు ఖాళీ కాగా, 4.76 లక్షల కేసుల మద్యాన్ని తాగేశారు. మద్యంతో పాటు కూల్ డ్రింక్స్, కేక్ లు, చికెన్, మటన్, చేపలు భారీగా అమ్ముడుపోయాయి. సాధారణ రోజులతో పోల్చుకుంటే నాన్ వెజ్ అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి.