Nalgonda: ‘పిల్లి’పై మ‌ళ్లీ కంచర్ల కొరడా.. పోస్టర్లు,ఫ్లెక్సీల తొలగింపు..!

ఎమ్మెల్యే కంచర్ల ఫ్లెక్సీలు తొల‌గించ‌ని వైనం.. విధాత: నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, నియోజకవర్గ బిఆర్ఎస్ నేత పిల్లి రామరాజుకు మధ్య సాగుతున్న రాజకీయ పోరు శనివారం మరో మలుపు తీసుకుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీలోని తన ప్రత్యర్థులపై అణిచివేత చర్యలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే పిల్లి రామరాజును పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన కంచర్ల నియోజకవర్గంలో పిల్లి […]

Nalgonda: ‘పిల్లి’పై మ‌ళ్లీ కంచర్ల కొరడా.. పోస్టర్లు,ఫ్లెక్సీల తొలగింపు..!
  • ఎమ్మెల్యే కంచర్ల ఫ్లెక్సీలు తొల‌గించ‌ని వైనం..

విధాత: నల్గొండ సిట్టింగ్ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, నియోజకవర్గ బిఆర్ఎస్ నేత పిల్లి రామరాజుకు మధ్య సాగుతున్న రాజకీయ పోరు శనివారం మరో మలుపు తీసుకుంది. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్లుగా స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పార్టీలోని తన ప్రత్యర్థులపై అణిచివేత చర్యలను మరింత ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే పిల్లి రామరాజును పట్టణ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన కంచర్ల నియోజకవర్గంలో పిల్లి కార్యకలాపాలకు ఆటంకం కలిగించే అవకాశాలను వదులుకోవడం లేదు.

అణిచివేత చ‌ర్య‌ల్లో భాగ‌మే…

ఉగాది పర్వదిన శుభాకాంక్షలతో జిల్లా కేంద్రంలో కంచర్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా, పిల్లి రామరాజు సైతం ఫ్లెక్సీలు, పోస్టర్లు వేయించారు. అయితే ఉగాది పండుగ అయిపోయిందంటూ మున్సిపల్ అధికారులు పట్టణంలోని పిల్లి రామరాజు పోస్టర్లను, ప్లెక్సీలను తొలగించే చర్యలు చేపట్టారు. అదే సమయంలో ఎమ్మెల్యే కంచర్ల ఫ్లెక్సీలు మాత్రం అలాగే ఉంచారు.

ఇదే విషయమై రామరాజు వర్గీయులు పోస్టర్లను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించగా తమకు రామరాజు పోస్టర్లను, ప్లెక్సీలను మాత్రమే తొలగించాలని పైనుండి ఆదేశాలు ఇచ్చారంటూ బదులిచ్చారు. తన పోస్టర్ల తొలగింపుపై రామరాజు స్పందిస్తూ వచ్చే ఎన్నికల్లో నల్గొండ సెగ్మెంట్ నుంచి బీఆర్ఎస్ టికెట్ విషయమై కంచర్లకు తాను పోటీగా మారినందునే తనపై కంచర్ల సాగిస్తున్న అణిచివేత చర్యల క్రమంలో నా పోస్టర్లను, ఫ్లెక్సీలను తొలగింప చేశారని ఆరోపించారు.

వాల్ రైటింగ్‌పై తెల్ల‌సున్నం..

ఇటివలే తన వాల్ రైటింగ్ పై తెల్ల సున్నం వేయించారని, ఇప్పుడు ఫ్లెక్సీలను, పోస్టర్లను తొలగింప చేశాడని, అధికారం అడ్డం పెట్టుకొని సొంత నాయకుల పైనే ఇంత అరాచకంగా అణిచివేత చర్యలకు పాల్పడుతున్న కంచర్ల తీరును నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారన్నారు.

చైతన్యాల పోరుగడ్డ నల్గొండ నియోజకవర్గం ఆయన అడ్డా కాదని, ప్రజల అడ్డా అని కంచర్ల గ్రహించే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. అయితే కంచర్ల వర్గీయులు మాత్రం మున్సిపాలిటీ తమ విధుల్లో భాగంగా రామరాజు పోస్టర్లు తొలగిస్తే మాపై అక్కసు ఎందుకంటూ రామరాజు ఆరోపణలను కొట్టి పారేశారు.