Hyderabad | హైదరాబాద్‌లో హరీశ్‌రావుపై ఫ్లెక్సీలు.. రాజీనామా చేయాలని డిమాండ్
హైదరాబాద్ నగరంలో బీఆరెస్ ఎమ్మెల్యే హరీశ్ రావుకు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చర్చనీయాంశమైంది. రైతు రుణమాఫీపై లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, హరీశ్‌రావుల మధ్య సాగిన పరస్పర సవాళ్ల మేరకు ఆగస్టు 15లోపునే సీఎం రేవంత్‌రెడ్డి 2లక్షల రుణమాఫీ చేశారని, చీము, నెత్తురు ఉంటే హరీశ్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలో డిమాండ్ చేశారు

Hyderabad | హైదరాబాద్ నగరంలో బీఆరెస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (BRS MLA Harish Rao)కు వ్యతిరేకంగా ఫ్లెక్సీల ఏర్పాటు చర్చనీయాంశమైంది. రైతు రుణమాఫీ (Rythu Runa Mafi)పై లోక్‌సభ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), హరీశ్‌రావుల మధ్య సాగిన పరస్పర సవాళ్ల మేరకు ఆగస్టు 15లోపునే సీఎం రేవంత్‌రెడ్డి 2లక్షల రుణమాఫీ చేశారని, చీము, నెత్తురు ఉంటే హరీశ్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలో డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao) అభిమానుల పేరిట ఏర్పాటైన ఈ ఫ్లెక్సీల్లో దమ్ముంటే రాజీనామా చెయ్.. రుణ మాఫీ అయి పోయే.. నీ రాజీనామా ఏడ బోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాశారు. ఈ ఫ్లెక్సీ (Flex)లను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్ పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. మరోవైపు తన రాజీనామా సవాల్‌పై హరీశ్‌రావు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. రుణమాఫీ కోతలతో మోసాలతో కూడుకుని ఉందని రైతులను, దేవుళ్లను కూడా రేవంత్‌రెడ్డి మోసం చేశారంటూ హరీశ్‌రావు విమర్శించారు.