ఎన్టీఆర్ ఫ్లెక్సీలని బాలయ్య తొలగించారా.. ఇందులో ఎవరిది తప్పు..!

నందమూరి తారకరామారావు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ ఫ్యామిలీలో విబేధాలు ఉన్నట్టు మరోసారి బయటపడ్డాయి. హరికృష్ణ మరణం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఈ ఉదయం నందమూరి కల్యాణ్ రామ్, ఎన్టీఆర్ లు వచ్చి నివాళులు అర్పించిన నేపథ్యంలో అక్కడ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. పెద్ద ఎత్తున ఎన్టీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక వారి అభిమానులు కూడా తెగ సందడి చేశారు. ఇక ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అక్కడ నుండి వెళ్లిన తర్వాత నందమూరి బాలకృష్ణ వచ్చి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించారు.
అయితే అక్కడకు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ ఫ్లేక్సీలను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు బాలయ్య. దీంతో బాలయ్య ఫ్యాన్స్.. ఆ ఫ్లేక్సీలను తొలగించారు. వాటిని రోడ్డు మీద పడేశారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హార్ట్ అయ్యారు. బాలయ్య ఇలా చేయడం కరెక్ట్ కాదని వారు మండిపడ్డారు. అయితే బాలయ్య ఆ ఫ్లెక్సీలు తొలగించడంపై సోషల్ మీడియాలో అనేక చర్చలు నడుస్తున్నాయి. ఈ రోజు నందమూరి ఫ్యామిలీ వెళ్లిన సందర్భం ఏమిటి అనేది గమనించాలి. వర్ధంతి సమయంలో సమయంలో ఆ తరహా కటౌట్లు మాత్రమే కాకుండా అలాంటి హంగులు కూడా ఏర్పాటు చేయడం ఎంతవరకు సబబు అనేది అవి పెట్టించినవారు అయినా ఒకసారి ఆలోచించాలి కొందరు చెప్పుకొస్తున్నారు.
సందర్బం సరైనది కాదు కాబట్టే బాలయ్య అలాంటివి అన్నీ తీయించి ఉండొచ్చు అని కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో పాటు అక్కడ ఉన్న అన్ని ఫ్లెక్స్ లను కూడా బాలయ్య తీయించేశారని, ఎన్టీఆర్ ఫ్లెక్సీ ఒక్కటే తీయించేసినట్టు రాద్దాంతం చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. మరి అసలు నిజనిజలాంటేవని రానున్న రోజులలో తెలియనుంది.