ఏప్రిల్‌ 1 నుంచే రిటర్నులు: CBDT

విధాత‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను ఏప్రిల్‌ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 2023-24 మదింపు సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని సీబీడీటీ పేర్కొంది. గత ఏడాది ఐటీఆర్‌ పత్రాలతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులేమీ లేనందున, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని తెలిపింది. సాధారణంగా జులై 31 వరకు […]

ఏప్రిల్‌ 1 నుంచే రిటర్నులు: CBDT

విధాత‌:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి సంబంధించిన రిటర్నులను ఏప్రిల్‌ 1 నుంచే సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. 2023-24 మదింపు సంవత్సరం ప్రారంభం రోజు నుంచే సంబంధిత ఫారాలు అందుబాటులో ఉంటాయని సీబీడీటీ పేర్కొంది.

గత ఏడాది ఐటీఆర్‌ పత్రాలతో పోలిస్తే ఈసారి పెద్దగా మార్పులేమీ లేనందున, పన్ను రిటర్నులు దాఖలు చేసేవారు సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయొచ్చని తెలిపింది. సాధారణంగా జులై 31 వరకు రిటర్నులు దాఖలు చేసేందుకు గడువు ఉంటుంది. అనివార్య సందర్భాల్లో మాత్రం సీబీడీటీ ఈ గడువును పొడిగిస్తుంది.