ఎవరి ఖర్చులు వారే పెట్టుకోండి.. మండలాల ఇంచార్జీలతో మాణిక్కం, రేవంత్

విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మండలాల ఇంచార్జీలతో బుధవారం గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. సెప్టెంబర్ 17 కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో నిర్వహించాలని సూచించారు. 18వ తేదీ నుంచి మన మునుగోడు.. మన కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని నిర్దేశించారు. ఉప ఎన్నికల్లో పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా అంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రచారంలో […]

  • By: Somu    latest    Sep 14, 2022 11:51 AM IST
ఎవరి ఖర్చులు వారే పెట్టుకోండి.. మండలాల ఇంచార్జీలతో మాణిక్కం, రేవంత్

విధాత, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మండలాల ఇంచార్జీలతో బుధవారం గాంధీభవన్‌లో రాష్ట్ర పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలు భేటీ అయ్యారు. సెప్టెంబర్ 17 కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో నిర్వహించాలని సూచించారు.

18వ తేదీ నుంచి మన మునుగోడు.. మన కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని నిర్దేశించారు. ఉప ఎన్నికల్లో పార్టీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేలా అంతా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రచారంలో నేతలు ఎవరి ఖర్చులు వారే పెట్టుకోవాలని రేవంత్ కోరారు.

టీఆర్ఎస్, బీజేపీలపై ప్రచార దాడిని ఉదృతం చేయాలని, ఆ రెండు పార్టీల ప్రచారాలకు ధీటుగా ఇంటింటి ప్రచారం సాగించాలని, ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలను ఈ సందర్భంగా చర్చించారు. ప్రచార వ్యూహాలపై కేడర్‌కు ఇంచార్జిలు దిశా నిర్దేశం చేసి ముందుకు నడిపించాలని సూచించారు.

అనంతరం గాంధీ భవన్‌లో మాణిక్యం ఠాగూర్‌తో కలిసి రేవంత్‌ రెడ్డి పలువురు కార్యకర్తల కుటుంబాలకు రూ. రెండు లక్షల ప్రమాద బీమా చెక్కుల పంపిణీ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను కష్టకాలంలో ఆదుకోవాలన్న ఉద్ధేశంతో ఈ పథకాన్ని సభ్యత్వ నమోదు సమయంలో ప్రారంభించామని, 45 లక్షల కార్యకర్తలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.