ఇందిరమ్మ ఇళ్లకు 3వేల కోట్లు.. సీఎం రేవంత్ సర్కార్ జీవో జారీ

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల హామీ దిశగా వేగంగా ముందడుగు వేస్తుంది. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 3వేల కోట్లను మంజూరీ చేస్తు జీవో జారీ చేసింది

ఇందిరమ్మ ఇళ్లకు 3వేల కోట్లు.. సీఎం రేవంత్ సర్కార్ జీవో జారీ

విధాత : కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల హామీ దిశగా వేగంగా ముందడుగు వేస్తుంది. ఇళ్లు లేని పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం 3వేల కోట్లను మంజూరీ చేస్తు జీవో జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దఫాగా 95, 235ఇళ్లను నిర్మించాలని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల్లో 38,094ఇళ్లను, పట్టణాల్లో 57,141ఇళ్లను నిర్మించనున్నారు. ప్రతి నియోజకవర్గానికి ఇంటి స్థలం ఉన్న పేదలు 3,500మందికి ఇళ్లను మంజూరీ చేసి వారికి 5లక్షల ఆర్ధిక సహాయాన్ని ఇంటి నిర్మాణం కోసం అందించనున్నారు.

ఇప్పటికే ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణ వసతి, 10లక్షల ఆరోగ్య బీమా, 500గ్యాస్ సిలిండర్‌, 200యూనిట్ల ఉచిత విద్యుత్తు గృహజ్యోతి పథకం అమలు చేసింది. ఈ నెల 11 నుంచి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని అమలు చేయనుంది. అలాగే బుధవారం పంటల బీమా పథకం రైతు నేస్తంను సైతం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.