Revanth Reddy | కొనుగోలు కేంద్రంలో అన్ని తిప్పలే.. రేవంత్ ఎదుట‌ రైతుల ఏకరువు..!

Revanth Reddy విధాత: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఏఐసీసీ నేత రేణుక చౌదరి ఖమ్మం వెళ్లే క్రమంలో పిల్లల మర్రి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగి ధాన్యం కొనుగోలు తీరు తెన్నులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో రైతులు తమ కష్టాలను వారికి వివరించారు. అకాల వర్షాలతో తమ ధాన్యం తడిసి పోతున్నప్పటికి అధికారులు కొనుగోలు జరిపించడం లేదని వాపోయారు. వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తుతుందన్నారు. తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం […]

Revanth Reddy | కొనుగోలు కేంద్రంలో అన్ని తిప్పలే.. రేవంత్ ఎదుట‌ రైతుల ఏకరువు..!

Revanth Reddy

విధాత: పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), ఏఐసీసీ నేత రేణుక చౌదరి ఖమ్మం వెళ్లే క్రమంలో పిల్లల మర్రి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగి ధాన్యం కొనుగోలు తీరు తెన్నులను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో రైతులు తమ కష్టాలను వారికి వివరించారు.

అకాల వర్షాలతో తమ ధాన్యం తడిసి పోతున్నప్పటికి అధికారులు కొనుగోలు జరిపించడం లేదని వాపోయారు. వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తుతుందన్నారు. తడిసిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూడాలని మొరపెట్టుకున్నారు. గతంలో టార్ఫాలిన్ పట్టాలైన తమకు ఇచ్చేవారని ఇప్పుడు అవి కూడా ఇవ్వడం లేదన్నారు.

పైగా ధాన్యం తూకం వేశాక కొనుగోలు కేంద్రం నుండి ధాన్యం బస్తాలు ఎగుమతి అయ్యేవరకు రైతులని బాధ్యులను చేస్తున్నారని, దీంతో తూకం వేసిన ధాన్యం బస్తాలను కూడా తామే వర్షాల నుంచి కాపాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. క్వింటాల్ కు ఐదు శాతం కోతలు పెడుతూ కూడా టార్ఫాలిన్లు ఇవ్వకుండా, తూకం వేసిన ధాన్యం బస్తాల బాధ్యతను తీసుకోకుండా రైతుల నెత్తిపై వాటి సంరక్షణ భారం మోపడం అన్యాయంగా ఉందన్నారు.

కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఐదు రోజులుగా తీసుకెళ్లడం లేదని, దీంతో అమ్మకానికి 20 రోజులకు పైగా కొనుగోలు కేంద్రంలో పడిగాపులు పడుతున్నామని, తూకం వేసాక కూడా బస్తాల ఎగుమతి జరిగే వరకు ఇక్కడే మరిన్ని రోజులు ఉండాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రేణుకా చౌదరి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గల్లా పట్టుకుంటాడని, రైతుల ధాన్యం కొనుగోలు జరిగేలా ప్రభుత్వంతో పోరాడుతారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే రైతుల కష్టాలు తీరుతాయన్నారు.

రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుందని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందన్నారు. రైతులు అధైర్య పడవద్దని, వారికి అండగా కాంగ్రెస్ నిలబడుతుందన్నారు.

అంతకుముందు పిల్లలమర్రి వద్ద ఆగిన రేవంత్ రెడ్డి, రేణుక చౌదరిలకు స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ గజమాలతో స్వాగతం తెలిపారు.