Richest City | ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా యాపిల్‌ సిటీ..! 3.40లక్షల మంది మిలియనీర్లతో టాప్‌ ప్లేస్‌..!

Richest City | విధాత: ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరం నిలిచింది. గ్లోబల్ వెల్త్ ట్రాకర్ హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్ (Henley & Partners) ప్రకారం.. ఈ నగరంలో లక్షల్లో మిలియనీర్లు ఉన్నారు. యాపిల్‌ సిటీగా పేరున్న న్యూయార్క్‌ నగరంలో 3.40లక్షల మంది మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. మార్కెట్‌ క్యాప్‌ అయిన న్యూయార్క్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌, నాస్‌డాక్‌ తదితర స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు నిలయంగా ఉన్నది. గతేడాది ఈ నగరంలో దాదాపు […]

Richest City | ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా యాపిల్‌ సిటీ..! 3.40లక్షల మంది మిలియనీర్లతో టాప్‌ ప్లేస్‌..!

Richest City |

విధాత: ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా అమెరికాలోని న్యూయార్క్‌ నగరం నిలిచింది. గ్లోబల్ వెల్త్ ట్రాకర్ హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్ (Henley & Partners) ప్రకారం.. ఈ నగరంలో లక్షల్లో మిలియనీర్లు ఉన్నారు. యాపిల్‌ సిటీగా పేరున్న న్యూయార్క్‌ నగరంలో 3.40లక్షల మంది మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. మార్కెట్‌ క్యాప్‌ అయిన న్యూయార్క్‌ స్టాక్ ఎక్స్ఛేంజ్‌, నాస్‌డాక్‌ తదితర స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు నిలయంగా ఉన్నది.

గతేడాది ఈ నగరంలో దాదాపు 3.4 లక్షల మంది మిలియనీర్లు ఉండగా.. ఈ ఏడాది న్యూయార్క్ అత్యంత సంపన్న నగరంగా అవతరించింది. న్యూయార్క్‌తో పాటు, 50 సంపన్న నగరాల్లో పది అమెరికాలోనే ఉండడం విశేషం. ఆ తర్వాత జాబితాలో ఆ తర్వాత టోక్యోలో 2,90,300 మంది, శాన్ ఫ్రాన్సిస్కోలో 285,000 మంది మిలినియర్లు ఉన్నారు. హెన్లీ అండ్‌ పార్ట్‌నర్స్ ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాలైన ఆఫ్రికా, ఆస్ట్రేలియా, సీఐఎస్‌, తూర్పు ఆసియా, యూరప్‌, మధ్యప్రాచ్యం, ఉత్తర అమెరికా, దక్షిణ ఆసియా, ఆగ్నేయాసియాలోని 97 నగరాలను పరిశీలించింది.

అమెరికా తర్వాత జాబితాలో.. డ్రాగన్‌ కంట్రీ

2012-2022 మధ్య కాలంలో అధిక నికర విలువ గల వ్యక్తుల సంఖ్య దాదాపు 40శాతం పెరిగిందని నివేదిక పేర్కొంది. దాంతో న్యూయార్క్‌ నగరం ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరంగా నిలిచింది. సింగపూర్‌లో ఇదే తరహాలో పెరుగుదల ఉండగా.. షాంఘై, హ్యూస్టన్, దుబాయి, ముంబయి వంటి ఇతర నగరాలు కూడా ఉన్నాయి. టాప్ 50 సంపన్న నగరాల్లో ఐదు నగరాలతో యూఎస్ తొలి స్థానం దక్కించుకోగా.. చైనా రెండో స్థానంలో ఉన్నది.

నాలుగు సంపన్న నగరాలతో ఆస్ట్రేలియా తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో న్యూయార్క్‌ నగరం తర్వాత ఎక్కువ సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరంగా కాలిఫోర్నియా బే ఏరియా రికార్డు నెలకొల్పింది. ప్రపంచంలోని అన్ని నగరాల కంటే బే ఏరియాలోనే భారీగా బిలియనీర్లు ఉన్నారు. ఆ తర్వాత న్యూయార్క్, బీజింగ్, లాస్ ఏంజిల్స్, షాంఘై నగరాల్లోనూ బిలియనిర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.

గత పదేళ్లలో చైనాలోని హాంగ్‌జౌ నగరంలో ఏకంగా 105శాతం వృద్ధి రేటు నమోదవడంతో అధిక నికర విలువ గల వ్యక్తుల సంఖ్య పెరిగింది. ఆ తర్వాత టెక్సాస్‌ ఆస్టిన్ అనే నగరంలో ఎక్కువ వృద్ధి కనిపించింది. ఇక్కడ అత్యధిక నికర ఆస్తి ఉన్న ప్రజల సంఖ్య 102శాతానికి చేరింది. దాంతో ఈ నగరం రెండవ స్థానంలో నిలిచింది. ఇక ఫ్లోరిడాలోని మయామి, వెస్ట్ పామ్ బీచ్ నగరాలు అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి.

నాలుగో స్థానానికి పడిపోయిన లండన్‌..

అత్యంత సంపన్నుల జాబితాలో లండన్‌ నాలుగో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం నగరంలో 22.58లక్షల మంది మిలియనిర్లు ఉన్నారు. 2000 సంవత్సరాల్లో లండన్‌ మిలియనిర్ల జాబితాలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో కొనసాగింది. గత 20 ఏళ్లలో ర్యాంకు పడిపోతూ వస్తున్నది. లండన్‌ తర్వాత 2,40,100 మంది లక్షలాదికారులతో సిటీ స్టేట్‌ సింగపూర్‌ తర్వాతి స్థానంలో ఉన్నది.