Richest CM In India | దేశంలో అత్యంత ధనిక సీఎం ఎవరో తెలుసా?

ADR Report | CROREPATI CMS ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే..! రూ.510కోట్లతో మొదటి ప్లేస్‌లో జగన్‌..! కేసీఆర్‌ ఆస్తి విలువ ఎంతంటే..? 15 లక్షల ఆస్థితో చివరి స్థానంలో మమత ADR Report | విధాత: దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) తెలిపింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి […]

Richest CM In India | దేశంలో అత్యంత ధనిక సీఎం ఎవరో తెలుసా?

ADR Report | CROREPATI CMS

  • ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులే..!
  • రూ.510కోట్లతో మొదటి ప్లేస్‌లో జగన్‌..!
  • కేసీఆర్‌ ఆస్తి విలువ ఎంతంటే..?
  • 15 లక్షల ఆస్థితో చివరి స్థానంలో మమత

ADR Report |

విధాత: దేశవ్యాప్తంగా ఉన్న 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులేనని అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) తెలిపింది. ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ జాబితాలో రూ.510కోట్ల విలువైన ఆస్తులతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి (Richest CM In India) ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు. ఆయన మొత్తం స్థిర, చరాస్తులు దాదాపు 510 కోట్లని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ADR) నివేదిక తెలిపింది.

దేశ రాజకీయ నాయకుల వివరాలను తరచూ ఏడీఆర్‌ నివేదికల రూపంలో విడుదల చేస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో బుధవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలను వెల్లడించింది. వైఎస్‌ జగన్‌ తర్వాతి స్థానంలో అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం పేమా ఖండు ఆస్తి 163 కోట్లని ఏడీఆర్‌ నివేదిక పేర్కొన్నది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ 63 కోట్ల ఆస్తులు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రూ.23.55కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారని తెలిపింది.

అత్యంత పేద ముఖ్యమంత్రిగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె పేరిట ఉన్న ఆస్తి 15 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఇక మిగతా సీఎంలంతా కోటీశ్వరులేనని పేర్కొంది. ఆ పై స్థానంలో కోటి రూపాయలతో కేరళ సీఎం పినరయి విజయన్‌, హర్యానా సీఎం మనోహర్‌లాల్‌ ఉన్నారు.

అదేవిధంగా 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 రాష్ట్రాల సీఎంలు కాగా.. కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు ఉండగా ప్రతి సీఎంకు సగటు ఆస్తులు రూ.33.96కోట్లు అని ఏడీఆర్‌ తెలిపింది. 13 మంది ముఖ్యమంత్రులపై తీవ్రమైనా నేరలకు సంబంధించి కేసులున్నట్లుగా ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొనట్లు వెల్లడించింది.

ఇక దక్షిణ భారతదేశంలోని ముఖ్యమంత్రుల్లో తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు స్టాలిన్‌, బసవరాజ్‌ బొమ్మైకి రూ.8కోట్లు, కేరళ సీఎం పినరయి విజయన్‌కు రూ.కోటి ఆస్తులు ఉన్నాయని ఏడీఆర్‌ నివేదిక పేర్కొంది. బిహార్‌, ఢిల్లీ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ రూ.3కోట్లు, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌ రూ.కోటికి పైగా ఆస్తి ఉందని ఏడీఆర్‌ నివేదికలో వివరించింది.

ఇక ప్రాంతీయ పార్టీల్లో అత్యంత సంపన్న పార్టీగా డీఎంకే నిలిచిందని అంతకు ముందు ఏడీఆర్‌ పేర్కొన్నది. రెండో స్థానంలో ఒడిశాకు చెందిన బిజు జనతాదళ్‌ ఉన్నది. డీఎంకేకు 318 కోట్ల ఆదాయం ఉన్నట్టు ఏడీఆర్‌ లెక్కగట్టింది. బీజేడీకి 307 కోట్ల ఆదాయం ఉన్నట్టు పేర్కొన్నది.

తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఆదాయం 218 కోట్లుగా తెలిపింది. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి రాజకీయ నాయకుడు తన స్థిర, చరాస్థులను ప్రకటించాల్సి ఉంటుంది. దీనిని బట్టి ఏ రాజకీయ నాయకుడి ఆస్తి ఎంతో తెలుస్తుంది.