Road Accident | వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Road Accident ఆర్టీసీ బస్సును ఢీకొన్న వ్యాన్ ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట కొత్త బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సును వెనుక […]

Road Accident | వర్ధన్నపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

Road Accident

  • ఆర్టీసీ బస్సును ఢీకొన్న వ్యాన్
  • ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట కొత్త బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సును వెనుక నుంచి డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో వ్యాన్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.

బస్టాండ్ వద్ద ఆగి ఉన్న బస్సును వెనుక నుంచి వచ్చిన వ్యాన్ వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మృతులు గాయపడ్డ వారికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.