Ulavapadu | రైలులో దోపిడీ దొంగల హల్ చల్
ప్రయాణికుల మెడలలో బంగారు గొలుసుల చోరీ Ulavapadu | విధాత : నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లు వీరేపల్లి మధ్య రైళ్లలో దొంగల రెచ్చిపోయారు. హైదరాబాద్ నుండి చెన్నె వెళ్లుతున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ లో ఎస్-4, ఎస్-5, ఏ-1 బోగీలలో ఏడుగురు ప్రయాణికుల మెడలలో బంగారపు గొలుసులు తెంచి వీరేపల్లి వద్ద రైలు ఆపి దొంగలు పరారైనట్లు తెలుస్తుంది. ఈ ఘటన అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో జరగగా, అదే ప్రాంత్రంలో వేకువ జామున రెండున్నర ప్రాంతంలో […]
- ప్రయాణికుల మెడలలో బంగారు గొలుసుల చోరీ
Ulavapadu |
విధాత : నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం చాగొల్లు వీరేపల్లి మధ్య రైళ్లలో దొంగల రెచ్చిపోయారు. హైదరాబాద్ నుండి చెన్నె వెళ్లుతున్న హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ లో ఎస్-4, ఎస్-5, ఏ-1 బోగీలలో ఏడుగురు ప్రయాణికుల మెడలలో బంగారపు గొలుసులు తెంచి వీరేపల్లి వద్ద రైలు ఆపి దొంగలు పరారైనట్లు తెలుస్తుంది.
ఈ ఘటన అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో జరగగా, అదే ప్రాంత్రంలో వేకువ జామున రెండున్నర ప్రాంతంలో హైదరాబాద్ నుండి తాంబరం చార్మినార్ ఎక్స్‌ప్రెస్ లో కూడా దోపిడి ప్రయత్నం చేసారు. సీఆర్పీ పోలీసుల అప్రమత్తతతో దొంగలు పరార్ అయ్యారు. దొంగలు రైలుపై రాళ్లదాడి చేసినట్లు ప్రయాణికులు చెబుతున్నారు.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్ వచ్చే సిగ్నల్స్ వ్యవస్థ లోపం వల్ల చార్మినార్ ఎక్స్‌ప్రెస్ వీరేపల్లి వద్ద ఆగినప్పుడు ఈ ఘటన జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. గంట వ్యవధిలోనే రెండు రైళ్లలో దోపిడీ జరగడం ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram