Roja | రోజాకు క్షమాపణ చెప్పిన డెక్కన్ క్రానికల్

Roja విధాత‌: టెక్నాలజి పెరిగిపోయి సమాచార ప్రవాహం ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా నకిలీ… తప్పుడు వార్తలు సైతం మన చేతిలోకి వచ్చి చేరుతోంది. అలా ఏది అసలు.. ఏది నకిలీ అన్నది తెలుసుకోకుండా … మళ్ళొక్కసారి పరిశీలించకుండా వార్తలు రాస్తే ఏమవుతుందో డెక్కన్ క్రానికల్ యాజమాన్యానికి అర్థం అయింది. దీంతో పర్యాటక శాఖామంత్రి రోజాకు క్షమాపణ సెప్పాల్సి వచ్చింది. అసలు ఏమైందంటే.. ఈమధ్య పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రుల మీద విరుచుకుపడుతూ వ్యక్తిగతంగా కూడా […]

  • Publish Date - July 16, 2023 / 11:58 AM IST

Roja

విధాత‌: టెక్నాలజి పెరిగిపోయి సమాచార ప్రవాహం ఎంత వేగంగా జరుగుతుందో అంతే వేగంగా నకిలీ… తప్పుడు వార్తలు సైతం మన చేతిలోకి వచ్చి చేరుతోంది. అలా ఏది అసలు.. ఏది నకిలీ అన్నది తెలుసుకోకుండా … మళ్ళొక్కసారి పరిశీలించకుండా వార్తలు రాస్తే ఏమవుతుందో డెక్కన్ క్రానికల్ యాజమాన్యానికి అర్థం అయింది. దీంతో పర్యాటక శాఖామంత్రి రోజాకు క్షమాపణ సెప్పాల్సి వచ్చింది.

అసలు ఏమైందంటే.. ఈమధ్య పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రుల మీద విరుచుకుపడుతూ వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఇటు రోజా రిప్లై ఇస్తూ పవన్ కళ్యాణ్ సంస్కారం గురించి మాట్లాడడం అంటే సన్నీ లియోన్ అనే పోర్న్ స్టార్ వేదాలు వల్లించినట్లే అంటూ ఒక ట్వీట్ చేసారు. దీనికి సన్నీ లియోన్ ఖాతా నుంచి ఒక రిప్లై వచ్చింది.

అందులో నేను షంషేర్ గా పోర్న్ స్టార్ వృత్తిలో ఉన్నాను.. మీ మాదిరిగా రహస్యంగా తప్పుడు పనులు చేయడం లేదు అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ ను ఆధారం చేసుకుని ఈరోజు డెక్కన్ క్రానికల్ పత్రిక ఏకంగా రోజాకు సన్నీలియోన్ కౌంటర్ అంటూ పెద్ద ఫీచర్ రాసిపారేసారు. చూస్తేనేమో ఆ సన్నీలియోన్ ట్విట్టర్ ఖాతా అసలైంది కాదని, ఎవరో ఒక నకిలీ ఖాతా తెరిచి అందులోంచి రోజాకు రిప్లై ఇచ్చారని తేలింది.

ఆ ట్విట్టర్ ఖాతా నకిలీది అని తెలియని క్రానికల్ విలేకరి ఏకంగా పెద్ద వార్త రాసి రోజా ప్రతిష్టకు భంగం కలిగించారు. దీన్ని వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా పట్టుకుని ట్విట్టర్ లో డెక్కన్ క్రానికల్ ఎడిటర్ మీద కామెంట్ల దండ యాత్ర చేశారు.. తలా తోక ఏదీ చూడకుండా వార్తలు రాస్తారా అంటూ ఎటాక్ చేసేసరికి. పాపం ఎడిటర్ దారికి వచ్చినట్లు అయింది.. ఏకంగా రోజాకు క్షమాపణ చెబుతూ ట్విట్టర్లో వార్త కామెంట్ పెట్టారు.

Latest News