Hyderabad | హైదరాబాద్ జూ పార్కులో రాయల్ బెంగాల్ టైగర్ మృతి
Hyderabad | హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు( Nehru Zoo Park )లో రాయల్ బెంగాల్ టైగర్( Royal Bengal Tiger ) మృతి చెందింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జో( Joe ) అనే 10 ఏండ్ల రాయల్ బెంగాల్ టైగర్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్లు జూ క్యురేటర్ వెల్లడించారు. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న టైగర్‌కు గత ఆరు నెలల నుంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మూత్ర పిండాల […]
Hyderabad | హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కు( Nehru Zoo Park )లో రాయల్ బెంగాల్ టైగర్( Royal Bengal Tiger ) మృతి చెందింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జో( Joe ) అనే 10 ఏండ్ల రాయల్ బెంగాల్ టైగర్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు చనిపోయినట్లు జూ క్యురేటర్ వెల్లడించారు.
మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న టైగర్‌కు గత ఆరు నెలల నుంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మూత్ర పిండాల వైఫల్యం కారణంగానే టైగర్ మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. అయితే గత కొంతకాలం నుంచి పులి ఆహారం సరిగా తినకపోవడంతో బక్కచిక్కినట్లు జూ క్యురేటర్ తెలిపారు. జో మృతి విచారకరమని పేర్కొన్నారు.
నెహ్రూ జూ పార్కులో గత నెల 25వ తేదీన అబ్దుల్లా( Abdullah ) అనే చీతా( Cheetah ) చనిపోయిన విషయం తెలిసిందే. దీని వయసు 15 ఏండ్లు కాగా, దశాబ్దం క్రితం సౌదీ రాజు( Saudi Prince ) చీతాను బహుమతిగా ఇచ్చాడు. అబ్దుల్లా గుండెపోటుతో చనిపోయింది
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram