AIIMS Bibinagar | బీబీనగర్ ఏయిమ్స్‌కు 1365కోట్లు: కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
AIIMS Bibinagar | విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా పరధిలోని బీబీనగర్ ఏయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం 1365కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కోన్నారు. బీబీనగర్ ఏయిమ్స్‌లో 700పడకల ఆసుపత్రి, 100సీట్ల మెడికల్ కళాశాల, 60సీట్లతో నర్సింగ్ కళాశాల, 30పడకలతో ఆయూష్ విభాగం కొనసాగనున్నట్లుగా తెలిపారు. ఏయిమ్స్‌తో ప్రజలకు ఆత్యాధునిక వైద్య సదుపాయలతో నాణ్యమైన వైద్య చికి్త్సలు అందుబాటులో వస్తాయన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే జిల్లాకు ఇటీవల […]
AIIMS Bibinagar |
విధాత, యాదాద్రి భువనగిరి జిల్లా పరధిలోని బీబీనగర్ ఏయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం 1365కోట్ల నిధులు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కోన్నారు. బీబీనగర్ ఏయిమ్స్‌లో 700పడకల ఆసుపత్రి, 100సీట్ల మెడికల్ కళాశాల, 60సీట్లతో నర్సింగ్ కళాశాల, 30పడకలతో ఆయూష్ విభాగం కొనసాగనున్నట్లుగా తెలిపారు.
ఏయిమ్స్‌తో ప్రజలకు ఆత్యాధునిక వైద్య సదుపాయలతో నాణ్యమైన వైద్య చికి్త్సలు అందుబాటులో వస్తాయన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇదే జిల్లాకు ఇటీవల శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేయగా, యాదాద్రి పట్టణంలో నిర్మించ తలపెట్టిన ఈ మెడికల్ కళాశాలకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
అటు నల్లగొండ, సూర్యాపేటలలోనూ మెడికల్ కళాశాలలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో తెలంగాణ వచ్చాకా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, ఒక కేంద్ర ప్రభుత్వ ఏయిమ్స్ ఏర్పాటు కావడం విశేషం.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram