RTC Bill | న్యాయశాఖ సలహా కోసం RTC బిల్లు

RTC Bill | విధాత: గవర్నర్ తమిళ సై ఆర్టీసీ విలీన బిల్లును న్యాయశాఖ పరిశీలన కోసం పంపినట్లుగా రాజభవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్టీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, న్యాయశాఖ పరిశీలనకు మాత్రమే పంపామని, న్యాయశాఖ సిఫారసుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గవర్నర్ తరుపునా రాజ్ భవన్ ప్రకటన వెల్లడించింది. ఈనెల 11న అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందడం జరిగింది. గవర్నర్ గురువారం సాయంత్రం కల్లా ఆర్టీసీ […]

  • By: krs |    latest |    Published on : Aug 17, 2023 5:00 PM IST
RTC Bill | న్యాయశాఖ సలహా కోసం RTC బిల్లు

RTC Bill |

విధాత: గవర్నర్ తమిళ సై ఆర్టీసీ విలీన బిల్లును న్యాయశాఖ పరిశీలన కోసం పంపినట్లుగా రాజభవన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆర్టీసీ బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, న్యాయశాఖ పరిశీలనకు మాత్రమే పంపామని, న్యాయశాఖ సిఫారసుల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని గవర్నర్ తరుపునా రాజ్ భవన్ ప్రకటన వెల్లడించింది.

ఈనెల 11న అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందడం జరిగింది. గవర్నర్ గురువారం సాయంత్రం కల్లా ఆర్టీసీ బిల్లును ఆమోదించాలంటు ఆర్టీసీ కార్మిక సంఘాలు డెడ్‌లైన్ విధించాయి.

అయితే గవర్నర్ న్యాయ శాఖ పరిశీలనకు బిల్లును పంపించడం గమనార్హం. ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను కూడా గవర్నర్ న్యాయశాఖ పరిశీలనకు పంపినట్లుగా రాజ్‌భవన్ ప్రకటనలో పేర్కోంది.