బిడ్డకు జన్మనిచ్చిన 3 గంటలకే పది పరీక్షలకు హాజరు..
Bihar | సాధించాలనే తపన ఉంటే.. ఏ సమస్య కూడా అడ్డంకి కాదు.. సమస్యలన్నింటినీ అధిగమిస్తూ లక్ష్యాన్ని ముద్దాడేందుకు శ్రమిస్తుంటారు. అలా ఓ మహిళ.. బిడ్డకు జన్మనిచ్చిన మూడు గంటలకే పది పరీక్షలకు హాజరైంది. పరీక్ష బాగా రాశానంటూ, మంచి మార్కులు వస్తాయని తెలిపింది. వివరాల్లోకి వెళ్తే.. బీహార్ బంకా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రుక్మిణీ కుమారి(22) అనే యువతి పదో తరగతి చదువుతోంది. అయితే బీహార్‌లో ఈ నెల 14న పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. […]
Bihar | సాధించాలనే తపన ఉంటే.. ఏ సమస్య కూడా అడ్డంకి కాదు.. సమస్యలన్నింటినీ అధిగమిస్తూ లక్ష్యాన్ని ముద్దాడేందుకు శ్రమిస్తుంటారు. అలా ఓ మహిళ.. బిడ్డకు జన్మనిచ్చిన మూడు గంటలకే పది పరీక్షలకు హాజరైంది. పరీక్ష బాగా రాశానంటూ, మంచి మార్కులు వస్తాయని తెలిపింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ బంకా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో రుక్మిణీ కుమారి(22) అనే యువతి పదో తరగతి చదువుతోంది. అయితే బీహార్‌లో ఈ నెల 14న పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రుక్మిణీ కుమారి గర్భిణి అయినప్పటికీ తొలి పరీక్షకు హాజరైంది. నెలలు నిండటంతో అదే రోజు సాయంత్రం ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.
15వ తేదీన ఉదయం 6 గంటలకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే అదే రోజు సైన్స్ పరీక్ష ఉండడంతో ఆ పరీక్షకు ఎలాగైనా హాజరు కావాలని రుక్మిణీ నిర్ణయించుకుంది. వైద్యులు కూడా ఆమెకు ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రానికి తరలించారు. బిడ్డకు జన్మనిచ్చిన మూడు గంటలకే పరీక్ష రాసింది రుక్మిణీ. సైన్స్ పరీక్ష బాగా రాశానని, మంచి మార్కులు వస్తాయని తెలిపింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram