Rythu Runamafi 2023 | మీ రుణాలు మాఫీ కాలే.. తేల్చిచెప్పిన బ్యాంక్‌ మేనేజర్‌! రైతులకు మాత్రం మెసేజ్‌లు

Rythu Runamafi 2023 | నిరసనకు దిగిన అన్నదాతలు విధాత: మెదక్ బ్యూరో: ప్రభుత్వం మీ రుణాలు మాఫీ అయిపోయాయని చెబుతున్నది. బ్యాంకు మేనేజర్‌ మాత్రం మాఫీ కాలేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. మెదక్‌ మండలంలో పలువురు రైతులకు రుణమాఫీ జరిగినట్టు ఫోన్‌ మెసేజ్‌లు వచ్చాయి. దీంతో ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్న మెదక్ మండలం తిమ్మక పల్లి, మంబోజి పల్లి, ర్యాలమడుగు, అవుసులపల్లి, మాచవరం, రాజపల్లి, బొల్లారం, మందాపూర్ తదితర గ్రామాల […]

  • By: krs    latest    Aug 17, 2023 2:02 PM IST
Rythu Runamafi 2023 | మీ రుణాలు మాఫీ కాలే.. తేల్చిచెప్పిన బ్యాంక్‌ మేనేజర్‌! రైతులకు మాత్రం మెసేజ్‌లు

Rythu Runamafi 2023 |

నిరసనకు దిగిన అన్నదాతలు

విధాత: మెదక్ బ్యూరో: ప్రభుత్వం మీ రుణాలు మాఫీ అయిపోయాయని చెబుతున్నది. బ్యాంకు మేనేజర్‌ మాత్రం మాఫీ కాలేదని చెప్పారు. దీంతో ఆగ్రహించిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. మెదక్‌ మండలంలో పలువురు రైతులకు రుణమాఫీ జరిగినట్టు ఫోన్‌ మెసేజ్‌లు వచ్చాయి.

దీంతో ఇండియన్‌ బ్యాంక్‌లో ఖాతాలు ఉన్న మెదక్ మండలం తిమ్మక పల్లి, మంబోజి పల్లి, ర్యాలమడుగు, అవుసులపల్లి, మాచవరం, రాజపల్లి, బొల్లారం, మందాపూర్ తదితర గ్రామాల రైతులు వివరాలు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు.

అయితే.. లోన్‌ మాఫీ కాలేదని మేనేజర్‌ చెప్పడంతో రైతులు అవాక్కయ్యారు. ఆగ్రహంతో మేనేజర్‌తో రైతులు వాగ్వాదానికి దిగారు. మేనేజర్‌కు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించారు. పట్టణ సీఐ వెంకట్ అక్కడికి చేరుకుని.. రైతులకు సర్ది చెప్పి పంపించారు.

కొందరి రైతుల లోన్ అకౌంట్లు క్లోజ్ చేసి, టార్గెట్ కోసం నూతన అకౌంట్‌లు తెరవడంతో ఇబ్బందులు వస్తున్నాయని తెలుస్తున్నది. రైతుల రుణమాఫీ కోసం వచ్చిన డబ్బు ట్రెజరీలో జమైందని సమాచారం. దీనిపై రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిస్తానని ఆయన హామీ ఇచ్చారు.