Sabitham Falls | జలపాతాలు.. మృత్యు పాశాలు

Sabitham Falls సబితం జలపాతం వద్ద యువకుని మృతి ప్రతి ఏటా ప్రమాదాలు విధాత, కరీంనగర్ బ్యూరో: వర్షాకాలంలో జాలువారే జలపాతాల అందాలు తనివితీరా వీక్షించేందుకు వస్తున్న యువత తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో, పెద్దపల్లి జిల్లా సబితం వద్ద జలపాతాలు ఉన్నాయి. ఈ రెండు జలపాతాల వద్ద సరైన రక్షణ చర్యలు లేవు. బుధవారం విద్యాసంస్థలకు సెలవు కావడంతో మిత్రులతో కలిసి సంతోషంగా గడిపేందుకు సబితం జలపాతం […]

Sabitham Falls | జలపాతాలు.. మృత్యు పాశాలు

Sabitham Falls

  • సబితం జలపాతం వద్ద యువకుని మృతి
  • ప్రతి ఏటా ప్రమాదాలు

విధాత, కరీంనగర్ బ్యూరో: వర్షాకాలంలో జాలువారే జలపాతాల అందాలు తనివితీరా వీక్షించేందుకు వస్తున్న యువత తగు జాగ్రత్తలు పాటించకపోవడంతో మృత్యువాత పడుతున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్‌లో, పెద్దపల్లి జిల్లా సబితం వద్ద జలపాతాలు ఉన్నాయి. ఈ రెండు జలపాతాల వద్ద సరైన రక్షణ చర్యలు లేవు.

బుధవారం విద్యాసంస్థలకు సెలవు కావడంతో మిత్రులతో కలిసి సంతోషంగా గడిపేందుకు సబితం జలపాతం వద్దకు వచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డారు.

కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన మానుపాటి వెంకటేష్ అనే యువకుడు మరో ముగ్గురు మిత్రులతో కలిసి సబితం జలపాతం వద్ద సంతోషంగా గడుపుతున్న క్షణాల్లోనే అనుకోని దుర్ఘటనతో జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయాడు.

గతంలోనూ ఈ జలపాతం వద్ద ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. జలపాతాల వద్ద రక్షణ చర్యలు లేకపోవడమే ఇందుకు కారణమని విమర్శలు వినవస్తున్నాయి. అధికారులు జలపాతాల వద్ద ప్రాణ నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు, పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.