Sadah | పెళ్లి చేసుకోలేదు కాబ‌ట్టి సంతోషంగా ఉన్నా.. మొగుడి కన్నా ప‌శువులు బెట‌రు..!

Sadah: నితిన్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జ‌యం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల భామ స‌దా. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అంద‌రి మ‌నసులు గెలుచున్న ఈ భామ వెళ్ళ‌వ‌య్యా వెళ్లు అనే డైలాగ్‌తో చాలా ఫేమస్ అయింది. స్టార్ హీరోల‌తో క‌లిసి పని చేసిన స‌దా ఇటీవ‌లి కాలంలో సినిమాలు త‌గ్గగంతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తుంది. నాలుగు పదుల వయస్సుకి అడుగు దూరంలో ఉన్నా ఈ భామ‌ మోస్ట్ […]

  • By: sn    latest    Jul 07, 2023 4:22 AM IST
Sadah | పెళ్లి చేసుకోలేదు కాబ‌ట్టి సంతోషంగా ఉన్నా.. మొగుడి కన్నా ప‌శువులు బెట‌రు..!

Sadah:

నితిన్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన జ‌యం చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన అందాల భామ స‌దా. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో అంద‌రి మ‌నసులు గెలుచున్న ఈ భామ వెళ్ళ‌వ‌య్యా వెళ్లు అనే డైలాగ్‌తో చాలా ఫేమస్ అయింది. స్టార్ హీరోల‌తో క‌లిసి పని చేసిన స‌దా ఇటీవ‌లి కాలంలో సినిమాలు త‌గ్గగంతో సోషల్ మీడియాలో పిచ్చెక్కిస్తుంది.

నాలుగు పదుల వయస్సుకి అడుగు దూరంలో ఉన్నా ఈ భామ‌ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోంది బ్యూటీ. ఇక అందాల ఆర‌బోత‌లో త‌గ్గేదే లే అంటుంది. ఎన్నిరకాలుగా ఎక్స్ ఫోజ్ చేయాలో.. అన్ని రకాలుగా ఎక్స్ ఫోజ్ చేస్తూ కుర్రాళ్ల‌కి పిచ్చెక్కిస్తుంది.

ఆ నాటి టాప్ హీరోయిన్ స‌దా ఇప్పటికింకా నా వయస్సు ఇంకా పదహారే అన్నట్లుగా పోజులిస్తూ రెచ్చ‌ గొడుతూ ఉంది. అయితే స‌దా ఇప్ప‌టికీ పెళ్లి చేసుకోక‌పోవ‌డం ఆమె అభిమానుల‌ని బాధిస్తుంది. ఎందుకు పెళ్లి చేసుకోవ‌డం లేదు అని స‌దాని ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చింది.

నేను పెళ్లి చేసుకోలేదు కాబ‌ట్టి ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాను. పెళ్లి చేసుకుంటే మ‌నం ఏం చేయ‌లేము. నాకు జంతువులు చాలా ఇష్టం. ఖాళీ స‌మ‌యాల‌లో అడ‌వికి వెళ్లి జంతువుల‌తో కాలక్షేపం చేస్తుంటాను. పెళ్లి చేసుకుంటే ఇవ‌న్నీ కుద‌ర‌వు క‌దా.

మ‌న‌ల్ని అర్ధం చేసుకునే వాళ్లు దొర‌క‌డం చాలా రేర్. అర్ధం చేసుకునే వాళ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే చాలా మంది విడిపోతున్నారు. ప్ర‌శాంతంగా ఉండాలంటే పెళ్లి చేసుకోకుండా ఉండ‌డం మంచిది. మొగుడు క‌న్నా కూడా ప‌శువులే బెట‌ర్ అంటూ స‌దా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

ప్ర‌స్తుతం ఈ భామ చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక స‌దా ఆ మధ్య బుల్లితెరపై హడావిడి చేసింది, ఏమైందో ఏమో కాని మ‌ళ్లీ మాయం అయ్యింది సదా. ఇక ఇప్పుడు వెబ్ సిరీస్ లు చేస్తుండ‌గా, ఒక మంచి హిట్ ప‌డితే మ‌ళ్లీ త‌న కెరీర్ ఊపందుకుంటుంద‌ని స‌దా భావిస్తుంది.