Hyderabad | సాగర్ రింగ్ రోడ్డు ఫ్లై ఓవర్ పనుల్లో ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు
Hyderabad | హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ పనుల్లో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. 10 మందిలో నలుగురు కూలీల పరిస్థితి […]

Hyderabad | హైదరాబాద్ సాగర్ రింగ్ రోడ్డు వద్ద చేపట్టిన ఫ్లై ఓవర్ పనుల్లో బుధవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంప్ ఏర్పాటు చేస్తుండగా అది ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. 10 మందిలో నలుగురు కూలీల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.