Samuthirakani | రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల గురించి సముద్రఖని ఏం చెప్పాడంటే.. హీరోలని మెచ్చుకోవడం అనేది అందరూ చేసేదే.. అయితే స్టార్ హీరోల గురించి, వాళ్ళ మంచి మనసు గురించి పొగిడితే మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. హీరోలన్నాకా కాస్త పేరు వచ్చిందంటే సెట్లో చేసే హడావుడి, చుట్టూ చేరే భక్తజనంతో వాళ్ళు చేసే భజనలతో కాస్త గర్వం పాళ్లు పెరుగుతుంది.. కానీ ఆ హీరో లిద్దరిదీ చాలా మంచి మనసని, అందరితోనూ ఎంతో సులువుగా కలిసిపోతారనే […]
Samuthirakani |
రామ్ చరణ్, అల్లు అర్జున్‌ల గురించి సముద్రఖని ఏం చెప్పాడంటే..
హీరోలని మెచ్చుకోవడం అనేది అందరూ చేసేదే.. అయితే స్టార్ హీరోల గురించి, వాళ్ళ మంచి మనసు గురించి పొగిడితే మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. హీరోలన్నాకా కాస్త పేరు వచ్చిందంటే సెట్లో చేసే హడావుడి, చుట్టూ చేరే భక్తజనంతో వాళ్ళు చేసే భజనలతో కాస్త గర్వం పాళ్లు పెరుగుతుంది.. కానీ ఆ హీరో లిద్దరిదీ చాలా మంచి మనసని, అందరితోనూ ఎంతో సులువుగా కలిసిపోతారనే విషయాన్ని ఓ స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ చెబితే ఆ మాటలు మరీ వైరల్ అవుతాయి కదా.. ఇప్పుడు అతగాడి మాటలు అలాగే వైరల్ అవుతున్నాయి.
విషయంలోకి వెళితే… స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అయిన సముద్రఖని అటు డైరెక్టర్ గానూ, ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మంచిపేరు సంపాదించుకున్నాడు. తను దర్శకత్వంలో సముద్రఖని మెగా హీరోలతో చేసిన ‘బ్రో’ ఇటీవలే బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. మరో పక్క నటనలోనూ తన సత్తా చాటుకుంటున్నాడు సముద్రఖని. విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాత్రల్లో నటిస్తున్నాడు.
ఇప్పటికే ఇద్దరు మెగా హీరోలను డైరెక్ట్ చేసిన సముద్రఖని.. ఇప్పుడు మరో ఇద్దరు మెగా హీరోల గురించి సంచలన విషయాలను చెప్పుకొచ్చారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లను తెగ పొగిడేశాడు. ముందుగా గురించి మాట్లాడుతూ.. రామ్ చరణ్‌తో RRR మూవీ చేసినపుడు మా ఇద్దరికీ మంచి బాండింగ్ ఏర్పడింది. నన్ను బాబాయ్ అని పిలిచేవాడు.
సెట్లో కూడా నన్ను ప్రత్యేకంగా చూస్తాడు. చాలా మంచి మనసు ఆయనది. అంత మంచి మనిషి బావుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాను. ఇక ఆయనతో ‘గేమ్ ఛేంజర్’ అనే మూవీలో కూడా చేస్తున్నాను.
ఈ మూవీలోనూ నాది చాలా మంచి పాత్ర. చరణ్‌కు సన్నిహితంగా ఉండే క్యారెక్టరే.. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్ నన్ను ఇంకా బాగా లైక్ చేస్తారు.
మరో హీరో అల్లు అర్జున్ గురించి చెబుతూ.. అల్లు అర్జున్ హీరోగా చేసిన అల వైకుంఠపురములో మూవీలో నేనూ నటించాను. ఆయన్ని అన్బు అర్జున్ అని పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని అర్థం. ఒక్క నాతోనే కాదు. అర్జున్ సెట్లో అందరినీ నవ్వుతూ పలకరిస్తాడు. ప్రేమగా మాట్లాడతాడు.
ప్రత్యేకించి నన్ను మరీ జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప 2’ మూవీలో కూడా ఆయనతో కలిసి నటిస్తున్నాను. ఇందులో నా పాత్ర గురించి చెప్పలేను.. అని మెగా ఫ్యామిలీకి చెందిన ఈ స్టార్ హీరోలను మెచ్చుకున్నాడు సముద్రఖని.