Sanjay Raut | వార‌ణాసిలో మోదీపై ప్రియాంక గెల‌వ‌చ్చు!

దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు శివసేన ఠాక్రే వ‌ర్గం ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్య‌ Sanjay Raut | విధాత‌: ఒక‌వేళ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తార‌ని శివ‌సేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) జోస్యం చెప్పారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నార‌ని తెలిపారు. రాయ్‌బరేలీ, […]

Sanjay Raut | వార‌ణాసిలో మోదీపై ప్రియాంక గెల‌వ‌చ్చు!
  • దేశంలో వేగంగా మారుతున్న రాజకీయ పరిస్థితులు
  • దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌కు పెరుగుతున్న ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు
  • శివసేన ఠాక్రే వ‌ర్గం ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్య‌

Sanjay Raut | విధాత‌: ఒక‌వేళ వారణాసి నుంచి ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయ‌కురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) పోటీ చేస్తే తప్పకుండా గెలుస్తార‌ని శివ‌సేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) జోస్యం చెప్పారు. వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నార‌ని తెలిపారు. రాయ్‌బరేలీ, వారణాసి, అమేథీ స్థానాల నుంచి బీజేపీ గెలవ‌డం క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు.

రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. “భారతదేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్న‌ది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే, ప్రధాని మోదీ (PM Modi) ఎన్నికల్లో గెలవడం కష్టం. ప్రియాంక ఆయనపై విజయం సాధించవ‌చ్చు” అని రౌత్ పేర్కొన్నారు.