సరస్వతీ దేవీకి అవమానం.. చీర కట్టించలేదంటూ ఆగ్రహం
అగర్తలా : ఈ నెల 14వ తేదీన దేశ వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని దేవాలయాలతో పాటు ప్రతి విద్యాలయంలో సరస్వతీ దేవీని పూజించారు

విధాత: అగర్తలా : ఈ నెల 14వ తేదీన దేశ వ్యాప్తంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని దేవాలయాలతో పాటు ప్రతి విద్యాలయంలో సరస్వతీ దేవీని పూజించారు. అయితే ఓ విద్యాలయంలో మాత్రం సరస్వతీ దేవీని అవమానించారు. విద్యార్థులు సరస్వతీ దేవి ప్రతిమను తయారు చేశారు. కానీ ఆ ప్రతిమకు చీర కట్టించలేదు. దీంతో ఏబీవీపీ, భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ వంటి ఆర్గనైజేషన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.
త్రిపుర రాజధాని అగర్తలాలోని ప్రభుత్వ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కాలేజీలో వసంత పంచమి సందర్భంగా సరస్వతీ దేవీ పూజ నిర్వహించారు. ఇక విద్యార్థులే సరస్వతీ దేవి విగ్రహాన్ని రూపొందించారు. సరస్వతి దేవి నిల్చున్నట్లు ఆ ప్రతిమ ఉంది. అయితే ఆ విగ్రహానికి చీర కట్టించలేదు. సరస్వతీ దేవీని అవమానించేలా ఉన్న ఆ విగ్రహం.. సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక క్షణాల్లో ఆ ప్రభుత్వ కాలేజీ వద్ద ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్ కు చెందిన సభ్యులు వాలిపోయారు. భారతీయ సంప్రదాయాలను మంటగలుపుతున్నారని కాలేజీ యాజమాన్యంపై మండిపడ్డారు. సరస్వతీ దేవికి చీర కట్టించకుండా అవమానపరుస్తారా..? అని ఆగ్రహం వెలిబుచ్చారు. ఈ వ్యవహారంపై సీఎం మణిక్ సాహా జోక్యం చేసుకొని, కాలేజీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆ కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు.