ఎఫ్‌డీల‌పై SBI రుణాలు.. వ‌డ్డీరేట్లు, అర్హ‌త‌లు తెలుసా!

విధాత‌: మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఉందా?.. అయితే మీ ఆర్థిక అవ‌స‌రాల కోసం ఆ ఎఫ్‌డీ మెచ్యూర్ అయ్యేదాకా ఆగాల్సిన అక్క‌ర‌ లేదు. ఎందుకంటే మీ ఎఫ్‌డీపై రుణం తీసుకోవ‌చ్చు. ఎఫ్‌డీలైనా.. టైం డిపాజిట్లు (టీడీ) అయినా ఇప్పుడు కేవ‌లం రాబ‌డినిచ్చే సాధ‌నాలు మాత్ర‌మే కాదు.. అప్పుల‌నిప్పించే వ‌న‌రులు కూడా అన్న‌ది మ‌రువ‌కండి. క‌స్ట‌మ‌ర్ల‌కు SBI షాక్‌.. పెర‌గ‌నున్న క్రెడిట్ కార్డ్ చార్జీలు ఎఫ్‌డీల‌ను తాక‌ట్టు పెట్టుకొని ఎస్బీఐ రుణాల‌ను ఇస్తున్న‌ది. ఇందుకు సిబిల్ స్కోర్‌తో […]

ఎఫ్‌డీల‌పై SBI రుణాలు.. వ‌డ్డీరేట్లు, అర్హ‌త‌లు తెలుసా!

విధాత‌: మీకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) ఉందా?.. అయితే మీ ఆర్థిక అవ‌స‌రాల కోసం ఆ ఎఫ్‌డీ మెచ్యూర్ అయ్యేదాకా ఆగాల్సిన అక్క‌ర‌ లేదు. ఎందుకంటే మీ ఎఫ్‌డీపై రుణం తీసుకోవ‌చ్చు. ఎఫ్‌డీలైనా.. టైం డిపాజిట్లు (టీడీ) అయినా ఇప్పుడు కేవ‌లం రాబ‌డినిచ్చే సాధ‌నాలు మాత్ర‌మే కాదు.. అప్పుల‌నిప్పించే వ‌న‌రులు కూడా అన్న‌ది మ‌రువ‌కండి.

క‌స్ట‌మ‌ర్ల‌కు SBI షాక్‌.. పెర‌గ‌నున్న క్రెడిట్ కార్డ్ చార్జీలు

ఎఫ్‌డీల‌ను తాక‌ట్టు పెట్టుకొని ఎస్బీఐ రుణాల‌ను ఇస్తున్న‌ది. ఇందుకు సిబిల్ స్కోర్‌తో కూడా పనిలేదు. టీడీఆర్‌/ఎస్‌టీడీఆర్‌/ఈ-టీడీఆర్‌/ఈ-ఎస్‌టీడీఆర్ క‌స్ట‌మ‌ర్ల‌కు ఆన్‌లైన్‌లో, జాయింట్ అకౌంట్ హోల్డ‌ర్స్‌కు శాఖ‌ల వ‌ద్ద రుణాలు ల‌భిస్తాయి.

SBI న‌యా ట‌ర్మ్ డిపాజిట్‌.. వ‌డ్డీరేటెంతో తెలుసా?

ఆర్‌డీ/ఈ-ఆర్‌డీ/ఎన్ఆర్ఈ/ఎన్ఆర్ఓ/ఆర్ఎఫ్‌సీ, ఎఫ్‌సీఎన్ఆర్ (బీ) డిపాజిట్ల‌పైనా శాఖ‌ల వ‌ద్ద ఎస్బీఐ రుణాలు తీసుకోవ‌చ్చు. డిమాండ్ లోన్‌/ఓవ‌ర్‌డ్రాఫ్ట్ సౌక‌ర్యంగా ఎఫ్‌డీ విలువ‌లో 90 శాతం వ‌ర‌కు రుణంగా పొంద‌వ‌చ్చు. సంబంధిత టీడీ రేటుపై ఒక్క శాతం ఎక్కువ‌గా ఈ రుణాల‌పై వ‌డ్డీరేటు ఉంటుంది. గ‌రిష్ఠంగా రూ.5 కోట్ల‌దాకా రుణం తీసుకోవ‌చ్చు.