నిజామాబాద్: చెట్టును ఢీకొట్టిన స్కూల్ బస్సు.. పది మంది విద్యార్థులకు గాయాలు
10మందికి విద్యార్థులకు గాయాలు విధాత, నిజామాబాద్: స్కూల్ బస్సు చెట్టును ఢీకొన్న సంఘటనలో పది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్ బస్సు సోమవారం లింగాయపల్లి సమీపంలో చెట్టును ఢీకొనగా విద్యార్థులకు గాయాలయ్యాయి. డ్రైవర్ బాలకృష్ణ నిరక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. కామారెడ్డి నుండి బయలుదేరిన బస్సు కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని లింగాయపల్లి వద్ద ప్రమాదానికి […]

- 10మందికి విద్యార్థులకు గాయాలు
విధాత, నిజామాబాద్: స్కూల్ బస్సు చెట్టును ఢీకొన్న సంఘటనలో పది మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గౌతమ్ మోడల్ స్కూల్ బస్సు సోమవారం లింగాయపల్లి సమీపంలో చెట్టును ఢీకొనగా విద్యార్థులకు గాయాలయ్యాయి. డ్రైవర్ బాలకృష్ణ నిరక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు గ్రామస్థులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారు. కామారెడ్డి నుండి బయలుదేరిన బస్సు కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని లింగాయపల్లి వద్ద ప్రమాదానికి గురైంది. స్కూల్ బస్సు రాజంపేట మీదుగా భిక్నూర్ మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయట పడడంతో ఊపిరి పీల్చుకున్నారు.