Schools Reopen | ఏపీలో 17 వరకు ఒంటిపూట బడులే

Schools Reopen విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున‌ పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని విపక్షాలు, ఉపాధ్యాయ […]

Schools Reopen | ఏపీలో 17 వరకు ఒంటిపూట బడులే

Schools Reopen

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల దృష్ట్యా ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది.

ఈ నెల 17వ తేదీ వరకు ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందున‌ పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని విపక్షాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. అయినా ప్రభుత్వం ఆ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా ఒంటి పూట బడుల నిర్వహణకే మొగ్గు చూపింది.