Chhattisgarh | ఫోన్ వాడొద్ద‌న్నందుకు.. జ‌ల‌పాతంలో దూకిన బాలిక‌

Chhattisgarh | ఓ బాలిక నిరంత‌రం ఫోన్ వాడుతోంది. ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తూ కాల‌క్షేపం చేస్తోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఆమె త‌ల్లిదండ్రులు ఫోన్ వాడొద్ద‌ని హెచ్చ‌రించారు. దీంతో బాలిక స్థానికంగా ఉన్న జ‌ల‌పాతంలో దూకింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చిత్ర‌కోట్ జ‌ల‌పాతం వ‌ద్ద చోటు చేసుకుంది. బ‌స్త‌ర్ జిల్లా చిత్ర‌కూట్ చౌకీ ఏరియాకు చెందిన ఓ బాలిక.. రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా ఫోన్ వాడుతోంది. ఆమె అలా ఫోన్ వాడ‌టం త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌లేదు. […]

Chhattisgarh | ఫోన్ వాడొద్ద‌న్నందుకు.. జ‌ల‌పాతంలో దూకిన బాలిక‌

Chhattisgarh | ఓ బాలిక నిరంత‌రం ఫోన్ వాడుతోంది. ఫ్రెండ్స్‌తో చాట్ చేస్తూ కాల‌క్షేపం చేస్తోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన ఆమె త‌ల్లిదండ్రులు ఫోన్ వాడొద్ద‌ని హెచ్చ‌రించారు. దీంతో బాలిక స్థానికంగా ఉన్న జ‌ల‌పాతంలో దూకింది. ఈ ఘ‌ట‌న ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని చిత్ర‌కోట్ జ‌ల‌పాతం వ‌ద్ద చోటు చేసుకుంది.

బ‌స్త‌ర్ జిల్లా చిత్ర‌కూట్ చౌకీ ఏరియాకు చెందిన ఓ బాలిక.. రాత్రి ప‌గ‌లు అనే తేడా లేకుండా ఫోన్ వాడుతోంది. ఆమె అలా ఫోన్ వాడ‌టం త‌ల్లిదండ్రుల‌కు న‌చ్చ‌లేదు. ఫోన్ వాడొద్ద‌ని హెచ్చ‌రించారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాలిక త‌న ఇంటికి స‌మీపంలోని చిత్ర‌కోట్ వాట‌ర్ ఫాల్స్ వ‌ద్ద‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం వెళ్లింది. అంద‌రూ చూస్తుండ‌గానే 90 అడుగుల ఎత్తులో నుంచి జ‌ల‌పాతంలోకి దూకేసింది. ఈ దృశ్యాన్ని అక్క‌డున్న కొంత మంది యువ‌కులు త‌మ ఫోన్ల‌లో చిత్రీక‌రించి వైర‌ల్ చేశారు.

అయితే బాలిక జ‌లపాతంలోకి దూకుతుంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన స్థానికులు.. ఆమెను దూకొద్ద‌ని కోరారు. అయిన‌ప్ప‌టికీ ఆమె ప‌ట్టించుకోలేదు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని, కొట్టుకుపోయిన బాలిక‌ను ప్రాణాల‌తో ర‌క్షించారు. బాలిక‌ను కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.