Telangana | బీరు సీసాలో చనిపోయిన తేలు.. మందు బాబులు షాక్
Telangana | బీరు సీసాలో తేలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే బీరు సీసాలో తేలు ప్రత్యక్షమైంది. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెటలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న వైన్ షాపులను రెండు బీర్లను కొనుగోలు చేశాడు. ఇక తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు సిద్ధమయ్యాడు. బీర్‌ను గ్లాస్‌లో పోసి ఒక సిప్ చేసే సరికి దుర్వాసన […]

Telangana | బీరు సీసాలో తేలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజంగానే బీరు సీసాలో తేలు ప్రత్యక్షమైంది. ఈ ఘటన జనగామ జిల్లా నర్మెటలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్ అనే వ్యక్తి స్థానికంగా ఉన్న వైన్ షాపులను రెండు బీర్లను కొనుగోలు చేశాడు. ఇక తన స్నేహితుడితో కలిసి మద్యం సేవించేందుకు సిద్ధమయ్యాడు. బీర్‌ను గ్లాస్‌లో పోసి ఒక సిప్ చేసే సరికి దుర్వాసన వచ్చింది. దీంతో ఆ బీర్ బాటిల్‌ను క్లీన్‌గా అబ్జర్వ్ చేయగా, అందులో చనిపోయిన తేలు కనిపించింది.
ఈ క్రమంలో ఆగ్రహావేశాలతో ఊగిపోయిన కరుణాకర్‌తో పాటు మిగతా వారు వైన్ షాపు యజమానిని ప్రశ్నించారు. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో కాసేపు వారు షాపు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు బాధిత వ్యక్తి ప్రయత్నించగా, అధికారులు అందుబాటులోకి రాలేదని తెలిసింది.