గంజాయితో పట్టుబడిన బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ జస్వంత్
యూ ట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ జస్వంత్ గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు

విధాత, హైదరాబాద్ : యూ ట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముఖ జస్వంత్ గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. షణ్ముఖ అన్న సంపత్ వినయ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసులు సంపత్ వినయ్ కోసం అతడి ఫ్లాట్‌కు వెళ్లారు.
ఫ్లాట్‌లో ఉన్నషణ్ముఖ వద్ద గంజాయి, డ్రగ్స్ దొరికాయి. దీంతో అన్నదమ్ములను పోలీసులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. యూ ట్యూబర్‌గా ఉన్న షణ్ముఖ బిగ్ బాస్-5తో పాపులర్ అయ్యాడు. గతంలో హిట్ అండ్ రస్ కేసులోనూ షణ్ముఖ జస్వంత్ అరెస్ట్ అయ్యాడు. అయితే అప్పుడు అతను మత్తులో లేకపోవడంతో ఆ కేసు నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు గంజాయితో పట్టుబడి మరో కేసులో ఇరుక్కున్నాడు.