Yashasvi jaiswal: ఫామ్ లో ఉన్న యశస్వి.. ఇక ఆ ఆటగాడు రిటైర్ కావల్సిందేనా..!
Yashasvi jaiswal: ప్రస్తుతం టీమిండియాలో చాలా మార్పులు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అద్భుతమైన ప్రదర్శన కనబరచిన వారికే టీంలో చోటు దక్కుతుంది. ఒకప్పుడు ఎంత గొప్పగా ఆడిన కూడా ఇప్పుడు మాత్రం ప్లేస్ దొరకడమే చాలా కష్టంగా మారింది. వెస్టిండీస్ టూర్‌లో పుజారా లాంటి బ్యాట్స్‌మెన్‌ని పక్కన పెట్టి యువ క్రికెటర్స్‌కి అవకాశం ఇచ్చారంటే రానున్న రోజులలో టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అర్ధమవుతుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ […]

Yashasvi jaiswal: ప్రస్తుతం టీమిండియాలో చాలా మార్పులు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అద్భుతమైన ప్రదర్శన కనబరచిన వారికే టీంలో చోటు దక్కుతుంది. ఒకప్పుడు ఎంత గొప్పగా ఆడిన కూడా ఇప్పుడు మాత్రం ప్లేస్ దొరకడమే చాలా కష్టంగా మారింది. వెస్టిండీస్ టూర్‌లో పుజారా లాంటి బ్యాట్స్‌మెన్‌ని పక్కన పెట్టి యువ క్రికెటర్స్‌కి అవకాశం ఇచ్చారంటే రానున్న రోజులలో టీమిండియాలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో అర్ధమవుతుంది. డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్ లో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ .. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి డబుల్ సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించుకున్న యశస్వి తన స్థానం పదిలపరచుకుంటాడని అనిపిస్తుంది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో దాదాపు డబుల్ సెంచరీకి చేరువగా వచ్చి, 171 పరుగుల వద్ద ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్‌లో 16 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. ఇటీవల ఐపీఎల్‌లోను యశస్వి అదరగొట్టడం మనం చూశాం. యశస్వి ఇంత ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో టెస్టు జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్ పునరాగమనం కష్టమనే చెప్పాలి. యశస్వి రాకతో శిఖర్ ధావన్ తలుపులు మూసుకుపొయినట్టే. 37 ఏళ్ల శిఖర్ ధావన్ వెస్టిండీస్ పర్యటనలో ఏ ఫార్మాట్‌లోనూ జట్టులోకి ఎంపిక కాలేదు. చూస్తుంటే భారత జట్టు నుంచి కూడా నిష్క్రమించే మార్గం చూపించినట్లైంది అని కొందరు అంటున్నారు.
ఇప్పటి వరకు 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడిన ధావన్ వన్డే వరల్డ్ కప్‌లోను ఎంపిక అయ్యే ఛాన్స్ లేదు. ఓపెనర్‌గా రోహిత్‌తో పాటు శుభమన్ గిల్ ఉండగా, ధావన్‌ని తీసుకొని మిడిల్ ఆర్డర్ లో ఆడించే ఛాన్స్ లేదు. వెస్టిండీస్‌పై యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ చూశాక టెస్ట్ క్రికెట్‌లో అతను పర్మినెంట్ ఓపెనర్ అని అందరు ఫిక్స్ అయిపోయారు. దీంతో శిఖర్ ధావన్ టెస్ట్, పరిమిత ఓవర్ క్రికెట్‌లోను ఛాన్స్ దక్కడం కష్టమే. ఈ పరిస్థితుల నడుమ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు.