Bigg Boss7 | ప్రిన్స్‌ని నానా ర‌కాలుగా ఇబ్బంది పెట్టిన ర‌తిక‌, దామిని.. ర‌చ్చ చేసిన శివాజి

Bigg Boss7 | బిగ్ బాస్ సీజ‌న్ 7లో మూడో కంటెస్టెంట్‌గా నిలిచేందుకు అమ‌ర్ దీప్, యావ‌ర్, శోభ రేసులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే వీరిలో ఎవ‌రు కంటెండర్ అవడం నచ్చలేదో చెప్పాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌డంతో ఒక్కొక్క‌రు క‌న్ఫెష‌న్ రూమ్‌కి వెళ్లి త‌మ అభిప్రాయాల‌ని తెలియ‌జేశారు. అయితే వారి ఫుటేజ్‌ని తాజా ఎపిసోడ్‌లో విడుద‌ల చేశారు బిగ్ బాస్. దీంతో హౌజ్‌మేట్స్ ర‌గ‌లిపోయారు. అయితే ప్రిన్స్ యావ‌ర్ ప్ర‌వ‌ర్త‌న అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. యావ‌ర్ కంటెండ‌ర్ […]

  • By: sn    latest    Sep 21, 2023 1:23 AM IST
Bigg Boss7 | ప్రిన్స్‌ని నానా ర‌కాలుగా ఇబ్బంది పెట్టిన ర‌తిక‌, దామిని.. ర‌చ్చ చేసిన శివాజి

Bigg Boss7 |

బిగ్ బాస్ సీజ‌న్ 7లో మూడో కంటెస్టెంట్‌గా నిలిచేందుకు అమ‌ర్ దీప్, యావ‌ర్, శోభ రేసులో ఉన్న విష‌యం తెలిసిందే. అయితే వీరిలో ఎవ‌రు కంటెండర్ అవడం నచ్చలేదో చెప్పాల‌ని బిగ్ బాస్ ఆదేశించ‌డంతో ఒక్కొక్క‌రు క‌న్ఫెష‌న్ రూమ్‌కి వెళ్లి త‌మ అభిప్రాయాల‌ని తెలియ‌జేశారు. అయితే వారి ఫుటేజ్‌ని తాజా ఎపిసోడ్‌లో విడుద‌ల చేశారు బిగ్ బాస్. దీంతో హౌజ్‌మేట్స్ ర‌గ‌లిపోయారు.

అయితే ప్రిన్స్ యావ‌ర్ ప్ర‌వ‌ర్త‌న అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. యావ‌ర్ కంటెండ‌ర్ అయ్యే అర్హ‌త లేద‌ని ర‌తిక చెప్ప‌గా, ఆమెని ఏమ‌న‌కుండా చాలా పాంప‌ర్ చేశాడు. పెద్ద మనసు చేసుకుని మరీ.. రతికకు చపాతీ తినిపిస్తుంటాడు. ఇది చూసిన ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు.

ఇక శివాజీ తన ప‌వ‌ర‌స్త్రా తీయ‌డం వెన‌క ఉన్న వ్య‌క్తికి అర్ధ‌రాత్రి ఒంటిగంట స‌మ‌యంలో గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడు. చిల్లర వేషాలు వేస్తే తొక్క తీసేస్తా అంటూ హౌస్ మేట్స్‌కు వార్నింగ్ ఇవ్వ‌గా, శివాజీ మాట‌ల‌కి ప్రియాంక కాస్త హ‌ర్ట్ అవుతుంది.

తన పవరాస్త్రను దొంగిలించింది ఎవరు అని శివాజీ.. సందీప్‌ను అడగగా.. నేను మాట ఇచ్చాను చెప్ప‌ను అని సందీప్ అంటారు. ఏం కాదు చెప్పు అని శివాజీ అన‌గా అప్పుడు తేజు అని చెబుతాడు. అప్పుడు నిజంగా తేజునే తీసాడ‌ని బండ బూతులు తిట్టిపోస్తాడు.

మ‌రోవైపు సందీప్.. పవరాస్త్రను తీసింది నువ్వే అంటూ.. శివాజీకి చెప్పా.. నువ్వు కూడా అదే చెప్పు అంటూ తేజుకి చెప్పుకొస్తాడు. ఇక ఇంటి సభ్యులవ్వడానికి ఫిజికల్ అండ్ మెంటల్ ఎండ్యూరెన్స్ ముఖ్యం అంటూ.. ప్రిన్స్‌కు ఓ టాస్క్‌ ఇస్తాడు బిగ్ బాస్. ఇక ఈ టాస్క్‌తో.. తన కంటెండర్‌ షిప్ ను వ్యతిరేకించిన దామిని, తేజు, రతికకు కూడా ఫ్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలియ‌జేస్తాడు

గార్డెన్‌ ఏరియాలో ఉన్న స్టాండ్‌పై చిన్ పెట్టాలని.. తేజు, రతిక, దామిని ఏం చేసినా.. గంట పాటు చిన్‌ను స్టాండ్‌ పై నుంచి తీయొద్దని ప్రక్రియ గురించి చెబుతాడు. శివాజీ, సందీప్ ఈ టాస్క్‌ కు సంచాలకులుగా ఉంటారు.అయితే ప్రిన్స్‌ని ఆ ముగ్గురు నానా ర‌కాలుగా ఇబ్బందులు పెట్టి ఫెయిల్ అయ్యేలా చేస్తారు. కానీ చాలా ఓపిక‌గా అన్ని భ‌రించి టాస్క్‌లో విన్న‌ర్‌గా నిలుస్తాడు.

ఇక తేజుకు.. టాస్క్‌ ఇస్తాడు బిగ్ బాస్. డే టైంలో.. బెడ్‌ పై అసలు నడుము వాల్చకుండా ఉండాలి, అలా చూసే బాధ్య‌త అమ‌ర్‌దీప్‌ది అని బిగ్ బాస్ చెబుతాడు. ఇక త‌ర్వాత శోభ వ‌ర్త్ కాద‌ని చెప్పిన వారి వీడియో చూపిస్తాడు బిగ్ బాస్.

ఇది చూసాక శోభ‌, గౌత‌మ్ మ‌ధ్య గ‌ట్టి ఫైటే న‌డుస్తుంది. అనంత‌రం అమర్‌దీప్‌ని ఒక్క ప్రియాంకనే అన్‌వర్తీ అనే చెప్పడంతో.. మ‌నోడు సైలెంట్ అయిపోతాడు. అయితే ప్రియాంక‌..అమ‌ర్ వెన‌క వెళ్లి తన క్లారిటీ ఇవ్వ‌డంతో తాను గెలిచి చూపిస్తానంటూ ఆమెతో చేతులు క‌లుపుతాడు.