Penpahad | పెన్ పహడ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. కారెక్కిన అనాజీపురం MPTC

Penpahad | గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించిన మంత్రి జగదీశ్‌ రెడ్డి విధాత : సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకీ చెందిన అనాజీపురం ఎంపీటీసీ గద్దల నాగరాజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి సమక్షంలో బీఆరెస్ లో చేశారు. కాగా.. తనతో పాటు అదే గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు దొంగరి విజయ్ కుమార్, వల్లంపట్ల విజయ్ […]

  • By: Somu    latest    Aug 14, 2023 12:17 PM IST
Penpahad | పెన్ పహడ్‌లో కాంగ్రెస్‌కు షాక్.. కారెక్కిన అనాజీపురం MPTC

Penpahad |

  • గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్వానించిన మంత్రి జగదీశ్‌ రెడ్డి

విధాత : సూర్యాపేట జిల్లా పెన్‌పహడ్ మండలంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీకీ చెందిన అనాజీపురం ఎంపీటీసీ గద్దల నాగరాజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర విద్యుత్తు శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి సమక్షంలో బీఆరెస్ లో చేశారు.

కాగా.. తనతో పాటు అదే గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నేతలు దొంగరి విజయ్ కుమార్, వల్లంపట్ల విజయ్ కుమార్, శంకర్, కొండేటి నాగరాజు, లెంకలపల్లి సత్యనారాయణ, అనుములపూరి కృష్ణప్రసాద్, సిద్దు, అశోక్, హేమంత్, రాయి చంటి, మీసాల గోపి, బచ్చలకురి ప్రభాకర్ తదితరులు బీఆరెస్‌లో చేరారు.

పార్టీలో చేరిన వారికి మంత్రి జగదీశ్‌ రెడ్డి గులాబీ కండువా లు కప్పి అహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ డైరెక్టర్ ఒంటెద్దు నరసింహా రెడ్డి , జడ్పీ వైస్ చైర్మన్ జి.వెంకట్ నారాయణ గౌడ్, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.