గర్ల్ ఫ్రెండ్‌తో షాపింగ్.. పబ్లిక్‌లోనే చితకబాదిన భార్య.. (వీడియో)
ఓ యువకుడికి పెళ్లైంది. కానీ మరో అమ్మాయి మోజులో పడ్డాడు. భార్యను వదిలేసి ఆమెతోనే తిరగడం మొదలు పెట్టాడు. హోటల్స్‌కు వెళ్లడం, షాపింగ్ చేయడం లాంటివి జరిగిపోతున్నాయి. అయితే గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కు వచ్చిన భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇంకేముంది.. పబ్లిక్‌లోనే భర్తను చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువకుడికి కొద్ది నెలల క్రితం పెళ్లి అయింది. భార్యతో గొడవ పడటంతో […]

ఓ యువకుడికి పెళ్లైంది. కానీ మరో అమ్మాయి మోజులో పడ్డాడు. భార్యను వదిలేసి ఆమెతోనే తిరగడం మొదలు పెట్టాడు. హోటల్స్‌కు వెళ్లడం, షాపింగ్ చేయడం లాంటివి జరిగిపోతున్నాయి. అయితే గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి షాపింగ్‌కు వచ్చిన భర్తను భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇంకేముంది.. పబ్లిక్‌లోనే భర్తను చితకబాదింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన ఓ యువకుడికి కొద్ది నెలల క్రితం పెళ్లి అయింది. భార్యతో గొడవ పడటంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఇక ఆ యువకుడు ఒంటరిగానే ఉంటున్నాయి. అయితే అతనికి ఓ ప్రియురాలు కూడా ఉంది. ఇక గర్ల్ ఫ్రెండ్‌ను వెంటేసుకుని షాపింగ్‌కు బయల్దేరాడు.
అదే సమయానికి భార్య కూడా తన తల్లితో కలిసి షాపింగ్‌కు వచ్చింది. ప్రియురాలితో కలిసి షాపింగ్ చేస్తున్న భర్తను చూసి ఆమెలో కోపం కట్టలు తెంచుకుంది. పబ్లిక్‌లోనే అతడిని చితకబాదింది. ప్రియుడ్ని ఆ దాడి నుంచి తప్పించేందుకు ప్రయత్నించిన గర్ల్ ఫ్రెండ్‌పై కూడా దాడి చేశారు.