Shriya | రోమ్ వీధుల్లో శ్రియ ర‌చ్చ‌.. ఆయ‌న‌తో ఘాటు లిప్ లాక్‌

Shriya: టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ చేస్తున్న ర‌చ్చకి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. సినిమాలు కాస్త త‌గ్గించిన సోష‌ల్ మీడియాలో మాత్రం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా నాజూకు సౌందర్యం కలిగిన త‌న అందంతో మ‌త్తెక్కించే ప్రయ‌త్నం చేస్తుంది. శ్రియ ఎప్ప‌టిక‌ప్పుడు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరుస్తూ కేక పెట్టిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ త‌న భ‌ర్త‌తో క‌లిసి రోమ్ న‌గ‌రంలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్రఖ్యాత కొలోజియం ఎదుట ఘాటు ఫోజులిస్తూ […]

  • By: sn    latest    Aug 04, 2023 2:04 AM IST
Shriya | రోమ్ వీధుల్లో శ్రియ ర‌చ్చ‌.. ఆయ‌న‌తో ఘాటు లిప్ లాక్‌

Shriya: టాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ శ్రియ చేస్తున్న ర‌చ్చకి సోష‌ల్ మీడియా షేక్ అవుతుంది. సినిమాలు కాస్త త‌గ్గించిన సోష‌ల్ మీడియాలో మాత్రం ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. నాలుగు పదుల వయసులో కూడా నాజూకు సౌందర్యం కలిగిన త‌న అందంతో మ‌త్తెక్కించే ప్రయ‌త్నం చేస్తుంది. శ్రియ ఎప్ప‌టిక‌ప్పుడు అల్ట్రా స్టైలిష్ లుక్‌లో మెరుస్తూ కేక పెట్టిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ అందాల ముద్దుగుమ్మ త‌న భ‌ర్త‌తో క‌లిసి రోమ్ న‌గ‌రంలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప్రఖ్యాత కొలోజియం ఎదుట ఘాటు ఫోజులిస్తూ రెచ్చిపోయిన ఈ భామ … తన భర్తకి ఘాటు లిప్ లాక్ ఇస్తూ అంద‌రు నోరెళ్ల‌పెట్టేలా చేసింది. వెండితెర‌పై ప‌లువురు హీరోలతో రొమాన్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ రియల్ లైఫ్‌లో రియల్‌ హీరో భర్తతో క‌లిసి నానా రచ్చ చేస్తుంది.

శ్రియ పిక్స్ అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. శ్రియ శరణ్ తన భర్తతో లిప్ లాక్ చేస్తున్న బోల్డ్ ఫోటోపై కొంద‌రు ట్రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ పిక్‌లో శ్రియ మోడ్రన్ డ్రెస్సులో హీరోయిన్‌లా ఉంటే ఆమె భర్త జీన్స్ , షర్ట్‌ వేసుకొని ఫోటోలకు హీరోలా పోజులిచ్చాడు. దీంతో ఈ పిక్ ప్ర‌తి ఒక్క‌రిని ఆక‌ర్షిస్తుంది. శ్రియ‌.. సినీ పరిశ్రమలో రెండు దశాబ్దాలుగా నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. తెలుగు , తమిళం చిత్రాల్లో టాప్ స్టార్స్‌ అందరి స‌ర‌స‌న న‌టించి మంచి పేరు తెచ్చుకుంది.. రీసెంట్‌గా మ్యూజిక్ స్కూల్ టైటిల్ తో ప్రయోగాత్మకంగా ఓ చిత్రం చేసింది. ఈ ఆర్ట్ ఫిల్మ్ అంతగా ఆదరణ ద‌క్కించుకోలేదు. ఉపేంద్ర హీరోగా తెరకెక్కిన కబ్జ మూవీలో కూడా లీడ్ రోల్ చేసింది.

ప‌ర్స‌న‌ల్ , ప్రొఫెష‌న‌ల్ లైఫ్‌ని స‌రిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతుంది ఈ అందాల ముద్దుగుమ్మ‌. శ్రియ‌.. 2018లో ఆండ్రీని వివాహం చేసుకుంది. శ్రియ వివాహం అత్యంత నిరాడంబరంగా జరిగిన విష‌యం విదిమే. సినిమా అవ‌కాశాలు కాస్త త‌గ్గిన స‌మ‌యంలోనే శ్రియ పెళ్లి పీట‌లెక్కింది. పెళ్లైన ఏడాదికే శ్రియ పండంటి అమ్మాయికి జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం కూతురితో కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంది.