Shriya Saran | పెళ్లికి ముందే నయం ఉండే.. ఇప్పుడేంటి శ్రియ మరీ ఇంత బోల్డ్‌గా తయారైంది!

Shriya Saran విధాత‌: అవకాశాలు రాకపోతే ఓ తీరు, అవకాశాలు వచ్చి మంచి విషయం ఉన్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నాకా మరో తీరులో ఉంటున్నారు ఇప్పటి హీరోయిన్లు. రొమాంటిక్ సీన్స్ లో కాస్త డోస్ పెంచేసి కనిపిస్తూ ఓవైపు, కాస్త బోల్డ్ పాత్రలు వేస్తూ మరో వైపు, ఇక ఎక్స్ పోజింగ్‌తో మరీ కన్నె పిల్లలైపోవడం మరోవైపు. ఇలా రోజుకో వింతతో నెట్టింట ప్రత్యక్షం అవుతూ ఎప్పుడూ వైరల్ కావడానికి రెడీ ఉంటున్నారీ మధ్య భామలు. తాజాగా […]

  • By: Somu    latest    Jul 01, 2023 12:30 PM IST
Shriya Saran | పెళ్లికి ముందే నయం ఉండే.. ఇప్పుడేంటి శ్రియ మరీ ఇంత బోల్డ్‌గా తయారైంది!

Shriya Saran

విధాత‌: అవకాశాలు రాకపోతే ఓ తీరు, అవకాశాలు వచ్చి మంచి విషయం ఉన్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నాకా మరో తీరులో ఉంటున్నారు ఇప్పటి హీరోయిన్లు. రొమాంటిక్ సీన్స్ లో కాస్త డోస్ పెంచేసి కనిపిస్తూ ఓవైపు, కాస్త బోల్డ్ పాత్రలు వేస్తూ మరో వైపు, ఇక ఎక్స్ పోజింగ్‌తో మరీ కన్నె పిల్లలైపోవడం మరోవైపు. ఇలా రోజుకో వింతతో నెట్టింట ప్రత్యక్షం అవుతూ ఎప్పుడూ వైరల్ కావడానికి రెడీ ఉంటున్నారీ మధ్య భామలు.

తాజాగా ఈ లిస్ట్ లోకి ‘ఇష్టం’ హీరోయిన్ శ్రియా శరణ్ కూడా చేరిపోయింది. 2001లో తన మొదటి చిత్రం తర్వాత దాదాపు 22 ఏళ్ళుగా ఏదో మూల మంచి పాత్రతో మెరుస్తూనే ఉంది. జనాలు మరిచిపోతున్నారనే సమయానికి మంచి పాత్ర చేస్తూ ఇప్పటి వరకూ మంచి హీరోయిన్‌గా నిలదొక్కుకుంది సినీ పరిశ్రమలో.

అయితే ఈమధ్య కాలంలో పెళ్ళి చేసుకుని ఓ బిడ్డకు తల్లయ్యాకా కూడా గ్లామర్ ఆరబోత ఆపలేదు శ్రియ. నలభై ఏళ్ళ వయసులోనూ గ్లామర్ పాత్రలకోసం ఫిల్మ్ మేకర్స్ దృష్టిలో పడాలని నానా తంటాలు పడుతుందీ అమ్మడు.

బాలీవుడ్‌ దృశ్యం 2 సినిమాలో తన నటనతో ఆకట్టుకని, కూడా గ్లామర్ పాత్రలో కోసం ఎగబడుతుందట. ఇప్పటికే అమ్మడి ఎక్స్‌పోజింగ్ కి ఐటమ్ సాంగ్ ఆఫర్లు కూడా వస్తున్నాయట. అయితే ఈ వయసులో అవకాశం రావడమే చేసేయకుండా దానికి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుందట. దాదాపు కోటి రూపాయలు అడుగుతుందట.

స్టార్ హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి కూడా దాదాపు పదేళ్ళు కావస్తున్నా ఏమాత్రం ఆలోచించకుండా గ్లామర్ పాత్రల కోసం చూడడమే కాకుండా అందాలను ఆరబోస్తూ ఆ ఒలకబోసిన అందాలను కెమెరాల్లో కనిపించేలా సర్దుకుంటూ నానా తంటాలు పడుతుంది శ్రియ. హాట్ స్పాట్స్ కవర్ చేసుకోలేక డ్రస్ చేతిలో పట్టుకుని కారు ఎక్కిస్తే.. కెమెరాల కంట పడింది శ్రియా.