Shriya Saran విధాత: నటిగా కొనసాగడం అంటే ఆ హీరోయిన్ చెల్లుబాటు అయ్యే కాలపరిమితి పదేళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ తర్వాత ఆమె లావు అవ్వచ్చు, లేదా పెళ్ళయ్యి, పిల్ల తల్లి కూడా కావచ్చు. ఇలాంటి శారీరక మార్పులతో రానురాను హీరోయిన్ కాలపరిమితి పదేళ్ళకు కుదించుకుపోయింది. ఒకప్పుడు శరీరాకృతి చూడని రోజుల్లో బాల నటిగా మొదలుపెట్టిన కెరియర్ అదే తెరపై బామ్మ వేషాలు వేసే వరకూ కొనసాగేది. మరిప్పుడో కాస్త లావయిందా? ఇక అంతే అమ్మ పాత్రల్లోకి […]
Shriya Saran
విధాత: నటిగా కొనసాగడం అంటే ఆ హీరోయిన్ చెల్లుబాటు అయ్యే కాలపరిమితి పదేళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ తర్వాత ఆమె లావు అవ్వచ్చు, లేదా పెళ్ళయ్యి, పిల్ల తల్లి కూడా కావచ్చు. ఇలాంటి శారీరక మార్పులతో రానురాను హీరోయిన్ కాలపరిమితి పదేళ్ళకు కుదించుకుపోయింది.
ఒకప్పుడు శరీరాకృతి చూడని రోజుల్లో బాల నటిగా మొదలుపెట్టిన కెరియర్ అదే తెరపై బామ్మ వేషాలు వేసే వరకూ కొనసాగేది. మరిప్పుడో కాస్త లావయిందా? ఇక అంతే అమ్మ పాత్రల్లోకి నెట్టేసి అలాగే చూడడానికి ఇష్టపడతారు ప్రేక్షకులు.
అలాంటిది ఈ హీరోయిన్ కెరీర్ మొదలు పెట్టి 23 ఏళ్ళు కావస్తున్నా ఎక్కాడా గ్రేస్ తగ్గలేదు. కాస్త ఒళ్ళు చేసిందన్న మాటలేదు. కేజీ కండ పెరగలేదు. ఇక అందం విషయానికి వచ్చినా అదే చెక్కుచెదరని శిల్పంలా ఉంది. ఇన్నేళ్ళల్లో ఆ తార ఇండస్ట్రీపరంగా ఒక్క కాంట్రవర్సీలోనూ ఇరుక్కోలేదు.
ఇంతకీ ఎవరా అని తెగ ఆలోచనలో పడిపోకండి. తనే సిరినవ్వుల శ్రియ. తన కెరియర్ మొదలు పెట్టి దాదాపు 23 ఏళ్ళు కావస్తుంది. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొన్న ‘మ్యూజిక్ స్కూల్’ వరకూ శ్రియ ప్రయాణం ఏ ఆటంకం లేకుండా సాగింది.
అయితే శ్రియ ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ దాదాపు తెలుగులోవే. తను వేరే భాషలో చేసిన సినిమాలు ఓ రెండు మూడు ఉంటాయంతే. తన మొదటి సినిమా విడుదల అయ్యి ఇప్పటికి 23 ఏళ్ళు అవుతోంది. ఎక్కడా శ్రియ ప్రయాణం ఆగింది లేదు. ‘ఇండస్ట్రీ పరంగా’ ఎవరితోనూ ఎలాంటి రూమర్స్ కూడా లేవు. ప్రేమాయణం నడిపింది కూడా లేదు. చాలా పద్దతిగా తన పనేదో తను చేసుకుంటూ పోతుందే కానీ, ఎక్కడా తొణకలేదు బెణకలేదు.
ఎలాంటి గాసిప్స్‌కి తన డిక్షనరీలో చోటీయలేదు ఈ అమ్మడు. ఎందరో అగ్ర హీరోలతో మొదలు పెట్టి చిన్న పోరగాళ్ళతో సైతం జతకట్టిన ఈ అమ్మడు ఇంత స్ట్రిక్ట్ అని ఎవరూ అనుకోరు. శ్రియ గురించి చెప్పాలంటే.. గ్లామర్ డోస్ ఈమధ్య పెంచిందనే కామెంట్స్ తప్పితే మరేం రాలేదు. సీనియర్స్‌తోనూ, యంగ్ హీరోలతోనూ తన హద్దుల్లో తనుండి పని చేసుకు వెళ్లిపోవడం వల్లే ఇన్నేళ్ళుగా కొనసాగుతుందేమో..
అంతేనా శ్రియ అందాన్ని కూడా అలాగే కాపాడుకుంటూ వస్తుంది. ఇన్నేళ్ళు కెరియర్లో ఒక్కసారి కూడా లావుగా కనిపించలేదు. అలాగే పెళ్ళయ్యి పిల్ల పుట్టినా ఎక్కడా ఆ అందం తగ్గిన ధాఖలాలు కూడా కనిపించనీయ లేదు శ్రియ. ఆమెని అలా చూసిన వారంతా శ్రియ సీక్రెట్ ఏమిటా అని? తలలు బాదుకుంటున్నారు. మిగతా హీరోయిన్స్‌కి కూడా శ్రియ ఆ సీక్రెట్ చెబితే.. వాళ్లు కూడా కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటారు. శ్రియ అదేదో చెప్పొచ్చుగా..