Singer Sunitha Husband | సింగర్ సునీత భర్త రామ్: మరీ ఇంత మోసమా.. ఒక్కసారిగా షాకిచ్చాడుగా
Singer Sunitha Husband | మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత రామ్ వీరపనేని తెలుసుకదా.. ఇలా కన్నా ప్రముఖ గాయని సునీత భర్తగానే ఆయన్ను టక్కున గుర్తుచేసుకుంటారేమో. ఇతన్నే మ్యాంగో రామ్‌గా అంతా పిలుచుకుంటూ ఉంటారు. డిజిటల్ రంగంలో ఆయనది పేరున్న కంపెనీ, దీని ద్వారా సినిమా సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనితో పాటు స్పెషల్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేయిస్తూ పాపులర్ అయ్యారు. అంతే కాకుండా రామ్ వీరపనేని మూవీ నిర్మాణ భాగస్వామిగా కూడా […]

Singer Sunitha Husband |
మ్యాంగో వీడియోస్ సంస్థ అధినేత రామ్ వీరపనేని తెలుసుకదా.. ఇలా కన్నా ప్రముఖ గాయని సునీత భర్తగానే ఆయన్ను టక్కున గుర్తుచేసుకుంటారేమో. ఇతన్నే మ్యాంగో రామ్‌గా అంతా పిలుచుకుంటూ ఉంటారు. డిజిటల్ రంగంలో ఆయనది పేరున్న కంపెనీ, దీని ద్వారా సినిమా సాంగ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దీనితో పాటు స్పెషల్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేయిస్తూ పాపులర్ అయ్యారు. అంతే కాకుండా రామ్ వీరపనేని మూవీ నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు.
ఇటీవలి కాలంలో ఇంకాస్త ముందడుగు వేసి ఆడియో రైట్స్ రంగంలోకీ అడుగుపెట్టింది ఈ సంస్థ. అయితే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న బ్రో సినిమాకు సంబంధించి ఆడియో రైట్స్‌ను కూడా దక్కించుకుంది. ఈ సంస్థలో వందల మంది పనిచేస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో ఈ సంస్థ దాదాపు రెండు కోట్ల రూపాయల వరకూ నష్టపోయిందట. ఇదేదో వ్యాపారంలో వచ్చిన నష్టం కాదు. అదే సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి మోసం చేయడంతో ఇంత నష్టం వచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే..
ఓ ప్రముఖ హీరో.. రామ్ వీరపనేనిని నిలదీయడంతో.. ఆ సంస్థలో పని చేస్తున్న వ్యక్తి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. మీడియా వర్గంలో ఇదే విషయంగా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. రామ్ నిర్వహిస్తున్న కంపెనీ సినిమా రంగంలో ప్రమోషన్లు చేస్తుంది. మూవీలకు సంబంధించి డిజిటల్ ప్రమోషన్లు చేస్తుంది. వెబ్ సిరీస్‌లు కూడా నిర్మింస్తుంది.
త్వరలోనే ఓటీటీ రంగంలోకి కూడా అడుగు పెట్టనుంది. అయితే తన సినిమాను ప్రమోట్ చేయమని ఓ ప్రముఖ హీరో.. రామ్ కంపెనీని సంప్రదించి, అందులో పనిచేసే కీలక వ్యక్తికి రెండు కోట్లు చెక్కు ఇచ్చాడట. ఆ చెక్‌ని ఆఫీస్ ఖాతాకు మార్చకుండా తన సొంత ఖాతాలో వేసుకుని సదరు వ్యక్తి ఇల్లు, కారు, పొలం వంటి ఆస్తులు కొనుగోలు చేసి సైలెంట్‌గా ఉన్నాడట.
తన సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టకుండా కామ్‌గా ఉన్నారని సదరు హీరో.. సునీత భర్త రామ్‌ని నిలదీయగా.. తీగ లాగితే డొంక కదిలినట్లయింది. విషయం తెలుసుకుని ఉద్యోగిని కంపెనీ నుంచి తొలగించారట రామ్. ఇంతకీ అతగాడు ఈ సంస్థలో ఇలాంటి పనిని మొదటిసారిగా చేశాడా లేక గతంలోనూ ఇలాంటి పనులు చేసి ఉంటాడా? అనే దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే విషయం ఇంత సీరియస్ అయినప్పటికీ రామ్ ఎక్కడా దీని గురించి మాట్లాడినట్టు లేదు. సంస్థకు చెడ్డపేరు రాకూడదనే కోణంలో ఆలోచించి గుట్టుగా ఎంక్వైరీ చేయిస్తున్నాడట రామ్. కాస్త ఏమరపాటుగా ఉన్నా ఇలాంటి మోసాలు జరిగేందుకు అవకాశం ఇచ్చినట్టే.. పాపం రామ్ ఈ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తాడో మరి.