Sitara | మహేష్ ఇంట విషాదం.. పెంపుడు కుక్క మృతి! కన్నీరు పెట్టుకున్న సితార
Sitara | కుటుంబంలో ఎవరైన చనిపోతే ఆ వేదన ఎంతలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ బాధ నుంచి బయటపడటానికి కొన్ని నెలలు పడుతుంది. అయితే నెలల వ్యవధిలో ఒక కుటుంబంలో వరుస మరణాలు జరిగితే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. 2022లో మహేష్ బాబు కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కన్నుమూసారు. 2022 ప్రారంభంలోనే అనగా జనవరి 8న మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు.. లివర్ సంబంధిత వ్యాధితో […]
Sitara |
కుటుంబంలో ఎవరైన చనిపోతే ఆ వేదన ఎంతలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ బాధ నుంచి బయటపడటానికి కొన్ని నెలలు పడుతుంది. అయితే నెలల వ్యవధిలో ఒక కుటుంబంలో వరుస మరణాలు జరిగితే ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. 2022లో మహేష్ బాబు కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు కన్నుమూసారు.
2022 ప్రారంభంలోనే అనగా జనవరి 8న మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు.. లివర్ సంబంధిత వ్యాధితో కన్ను మూశారు. మహేష్ బాబుని తన కొడుకులా భావించి ఎంతో బాగా చూసుకున్న రమేష్ బాబు చనిపోవడంతో ఆయన చాలా బాధకు లోనయ్యారు. రమేష్ బాబు మృతి చెందిన సమయంలో మహేష్ బాబు కరోనా వల్ల క్వారంటైన్‌లో ఉండడంతో అన్నయ్యని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడు.
మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి 2022 సెప్టెంబర్ 28న వయోభారంతో కన్నుమూశారు. తల్లి మరణంతో మహేష్ బాబుతో పాటు కృష్ణ బాగా కుంగిపోయారు. ఇక అదే ఏడాది నవంబర్ 15 మంగళవారం ఉదయం నాలుగు గంటల సమయంలో కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా.. ఆస్పత్రిలో చేరిన కృష్ణకు డాక్టర్లు 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసిన ప్రాణాలు కాపాడలేక పోయారు.
ఇలా ఒకే ఏడాదిలో మహేష్ బాబు ఇంట ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందగా, ఘట్టమనేని కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్న మహేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఈసంఘటనతో మహేష్ ఫ్యామిలీ అంతా చిన్నపాటి కలత చెందారు.
View this post on InstagramFollow us on Social Media
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram