Slumdog Millionaire | బండిపై బిర్యానీ అమ్ముకునే యువకుడికి.. భారీ ప్యాకేజీతో ఉద్యోగం
Slumdog Millionaire | విధాత: పుట్టడం పుట్టడమే ధనవంతుల ఇళ్లలో పుట్టేవారు కొందరైతే.. ఎక్కూ తొలి మెట్టూ కొండని కొట్టూ ఢీకొట్టూ అని రజనీకాంత్‌లా కష్టపడి పైకొచ్చేవారు మరికొందరు. తాజాగా రోడ్డు మీద తోపుడు బండిపై బిర్యానీ విక్రయించే షకీర్ అనే యువకుడు బ్యాంకులో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం తన లైఫ్‌లో యురేకా మూమెంట్ వచ్చిందని తెగ సంతోష పడిపోతున్నాడు. షకీర్ సహచరులందరూ అతడిని స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోతో పోలుస్తున్నారు. సౌత్ ఈస్ట్ దిల్లీలోని […]

Slumdog Millionaire |
విధాత: పుట్టడం పుట్టడమే ధనవంతుల ఇళ్లలో పుట్టేవారు కొందరైతే.. ఎక్కూ తొలి మెట్టూ కొండని కొట్టూ ఢీకొట్టూ అని రజనీకాంత్‌లా కష్టపడి పైకొచ్చేవారు మరికొందరు. తాజాగా రోడ్డు మీద తోపుడు బండిపై బిర్యానీ విక్రయించే షకీర్ అనే యువకుడు బ్యాంకులో మంచి ప్యాకేజీతో ఉద్యోగం సాధించాడు.
ప్రస్తుతం తన లైఫ్‌లో యురేకా మూమెంట్ వచ్చిందని తెగ సంతోష పడిపోతున్నాడు. షకీర్ సహచరులందరూ అతడిని స్లమ్ డాగ్ మిలియనీర్ హీరోతో పోలుస్తున్నారు.
సౌత్ ఈస్ట్ దిల్లీలోని జామియా నగర్‌లో నివసించే షకీర్.. బిర్యానీ విక్రయిస్తూ ఉండేవాడు. పని చేసుకుంటూనే మొక్కవోని దీక్షతో చదువుకుంటూ అమితీ యూనివర్సిటీలో ఎంబీయే సీటు సంపాదించాడు.
షకీర్ అమితీ యూనివర్సిటీలో ఎంబీయే సీటు సంపాదించినప్పటి నుంచీ అసీం ఆషా ఫౌండేషన్ బాసటగా నిలిచింది. క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిధులు సేకరించి ఎప్పటికప్పుడు అతడి ఫీజులు చెల్లించింది.
కష్టపడి చదువుకున్న ఆ యువకుడు ఎంబీయే పూర్తి చేశాడు. తాజాగా ఓ బడా ప్రైవేట్ బ్యాంకు బ్యాంకులో రూ.8.5 లక్షల వార్షిక వేతనంతో జాబ్ సైతం సంపాదించాడు.
అయితే ఈ విజయం వెనుక షకీర్ కష్టంతో పాటు ఫౌండేషన్ తోడ్పాటూ ఉంది. రోడ్డు పక్కన ఆ పనీ ఈ పనీ చేసుకుంటూ మరుగును పడిపోయిన షకీర్ లాంటి మెరికలను వెలకితీయడమే తమ పని అని అసీం ఆషా ఫౌండేషన్ డైరెక్టర్ అసీం ఉస్మాన్ వెల్లడించారు.