2 నుంచి 19శాతం త‌గ్గిన స‌బ్బుల ధ‌ర‌లు

విధాత: సామాన్యుడికి ఊర‌ట క‌లింగే వార్త ఇది. గ‌త రెండేండ్ల నుంచి పెరిగిన ధ‌ర‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న సామాన్యుల‌కు ఎఫ్ఎంసీజీ(FMCG) సంస్థ హిందుస్థాన్ యూనిలీవ‌ర్(HUL) ప్ర‌స్తుతం శుభ‌వార్త‌ను వినిపించింది. స‌బ్బులు, డిట‌ర్జెంట్ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను 2 శాతం నుంచి 19 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. క‌మోడిటీ ఉత్ప‌త్తులు భ‌గ్గుమ‌న‌డంతో గ‌డిచిన రెండేండ్లుగా ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను 20 శాతం వ‌ర‌కు పెంచాయి. క‌రోనా స‌మ‌యంలో అమ్మకాలు ప‌డిపోవ‌డంతో.. మ‌ళ్లీ రేట్ల‌ను పెంచాయి. జూన్ త్రైమాసికం […]

2 నుంచి 19శాతం త‌గ్గిన స‌బ్బుల ధ‌ర‌లు

విధాత: సామాన్యుడికి ఊర‌ట క‌లింగే వార్త ఇది. గ‌త రెండేండ్ల నుంచి పెరిగిన ధ‌ర‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న సామాన్యుల‌కు ఎఫ్ఎంసీజీ(FMCG) సంస్థ హిందుస్థాన్ యూనిలీవ‌ర్(HUL) ప్ర‌స్తుతం శుభ‌వార్త‌ను వినిపించింది. స‌బ్బులు, డిట‌ర్జెంట్ ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను 2 శాతం నుంచి 19 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

క‌మోడిటీ ఉత్ప‌త్తులు భ‌గ్గుమ‌న‌డంతో గ‌డిచిన రెండేండ్లుగా ఆయా ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను 20 శాతం వ‌ర‌కు పెంచాయి. క‌రోనా స‌మ‌యంలో అమ్మకాలు ప‌డిపోవ‌డంతో.. మ‌ళ్లీ రేట్ల‌ను పెంచాయి. జూన్ త్రైమాసికం నుంచి ముడి స‌రుకుల ధ‌ర‌లు దిగి వ‌స్తుండ‌టంతో.. ఈ ప్ర‌యోజ‌నాన్ని సంస్థ‌లు వినియోగ‌దారుల‌కు బ‌ద‌లాయిస్తున్నాయి.

దేశీయ ఎఫ్‌ఎంసీజీ రంగంలో అగ్రగామి సంస్థయైన హెచ్‌యూఎల్‌..లైఫ్‌బాయ్‌ ధరను 5 శాతం, డోవ్‌ సబ్బు ధరను రూ.27 నుంచి రూ.22కి తగ్గించింది. స‌ర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 ఎంఎల్ ధ‌ర రూ. 115 ఉండ‌గా, రూ. 112కి త‌గ్గించింది. రిన్ డిట‌ర్జెంట్ పౌడ‌ర్ కిలో ప్యాక్ ధ‌ర రూ. 103 నుంచి రూ. 99కి త‌గ్గించింది.

లైఫ్ బాయ్ స‌బ్బులు 125 గ్రాములు క‌లిగిన నాలుగు స‌బ్బుల ప్యాక్ ధ‌ర రూ. 140 నుంచి రూ. 132కి త‌గ్గించింది. ల‌క్స్ స‌బ్బులు 100 గ్రాములు క‌లిగిన నాలుగు ప్యాక్ ధ‌ర రూ. 156 నుంచి రూ. 140కి త‌గ్గించింది. డోవ్ 50 గ్రాముల స‌బ్బు ధ‌ర‌ను రూ. 27 నుంచి రూ. 22కి త‌గ్గించింది. వీల్ గ్రీన్ బార్ 80 గ్రాముల ఎస్కేయూ ధ‌ర రూ. 7 నుంచి రూ. 5కి త‌గ్గించింది.