Sonu Nigam | బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ సోనూ నిగమ్‌పై దాడి..!

Sonu Nigam | ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌ (Sonu Nigam)పై దాడి జరిగింది. సంగీత కార్యక్రమంలో పాల్గొన్న సింగర్‌తో పాటు అతని స్నేహితుడిపై సైతం దాడి చేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, సోనూ నిగమ్‌ గాయాల నుంచి తప్పించుకోగా.. స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాడీగార్డ్ తనను సురక్షితంగా రక్షించాడని సోనూ నిగమ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం చెంబూర్‌లో జరిగిన సంగీత కార్యక్రమంలో స్నేహితుడితో కలిసి సోనూనిగమ్‌ హాజరయ్యాడు. స్టేజీపై నుంచి […]

Sonu Nigam | బాలీవుడ్‌ ప్రముఖ సింగర్‌ సోనూ నిగమ్‌పై దాడి..!

Sonu Nigam | ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ సోనూ నిగమ్‌ (Sonu Nigam)పై దాడి జరిగింది. సంగీత కార్యక్రమంలో పాల్గొన్న సింగర్‌తో పాటు అతని స్నేహితుడిపై సైతం దాడి చేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే, సోనూ నిగమ్‌ గాయాల నుంచి తప్పించుకోగా.. స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాడీగార్డ్ తనను సురక్షితంగా రక్షించాడని సోనూ నిగమ్ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. సోమవారం సాయంత్రం చెంబూర్‌లో జరిగిన సంగీత కార్యక్రమంలో స్నేహితుడితో కలిసి సోనూనిగమ్‌ హాజరయ్యాడు. స్టేజీపై నుంచి సోనూనిగమ్‌ తన బృందంతో వస్తుండగా తోపులాట చోటు చేసుకుంది.

ఉద్ధవ్‌ ఠాక్కే వర్గానికి చెందిన ఎమ్మెల్యే ప్రకాశ్‌ ఫర్తేపేకర్‌ కుమారుడు స్వప్నిల్‌ చెంబూర్‌ ఉత్సవంలో సోనూనిగమ్‌ను కలవాలని అనుకున్నారు. సెల్ఫీలు తీసుకునేందుకు స్టేజీ మెట్లు ఎక్కారు. అయితే, అక్కడున్న అంగరక్షకులు కలిసేందుకు నిరాకరించడంతో గొడవకు దారి తీసింది. ఈ క్రమంలో సోను నిగమ్‌ స్నేహితుడు రబ్బానీ ఖాన్‌ను తోయడంతో మెట్లపై నుంచి కిందపడిపోయాడు. ఆ తర్వాత సోనూ నిగమ్‌తో పాటు అతని స్నేహితుని ఎమ్మెల్యే తనయుడు దూషించినట్లు సమాచారం. ఈ సమయంలో అక్కడికి వచ్చిన సోనూ నిగమ్‌ బాడీ గార్డ్‌ సింగర్‌తో పాటు అతడి స్నేహితుడు కాపాడారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

దీనిపై సోనూ నిగమ్‌ స్పందిస్తూ తాను బాగానే ఉన్నానని, కానీ స్నేహితుడు రబ్బానీఖాన్‌, నా బాడీగార్డ్‌ గాయపడ్డారని తెలిపారు. రబ్బానీ ఖాన్‌ దివంగత ఉస్తాన్‌ గులాం ముస్తాఫా కుమారుడు. గాయపడ్డ రబ్బానీతో పాటు మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స అందించిన తర్వాత డిశ్చార్జి చేశారు. దీనిపై ఎమ్మెల్యే ప్రకాశ్‌ ఫర్తేపేకర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. గతంలోనూ స్వప్నిల్‌ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. ఏప్రిల్‌ 2022లో అవినీతి వ్యతిరేకంగా ‘పోల్‌ ఖోల్‌’ రథయాత్ర సందర్భంగా అర్ధరాత్రి జరిగిన రాళ్లదాడి ఘటనలో అతని హస్తం ఉందని బీజేపీ ఆరోపించింది.

ఇదిలా ఉండగా.. ఈ ఘటనను చెంబూర్‌ పోలీసులు ధ్రువీకరించారు. అనంతరం ఎమ్మెల్యే కుమారుడు, అతని మద్దతుదారులపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సోనూ నిగమ్‌పై దాడికి సంబంధించిన వీడియోను సమీత్‌ ఠక్కర్‌ అనే ట్విట్టర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు. ‘అజాన్‌ లౌడ్‌ స్పీకర్లకు వ్యతిరేకంగా గొంతు పెంచిన గాయకుడు సోనూ నిగమ్‌పై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన ఎమ్మెల్యే తనయుడు, అతని అనుచరులు దాడి చేశారు’ అంటూ ట్వీట్‌ చేశారు.