మరోసారి సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను తీసుకువచ్చిన ఆర్‌బీఐ..! ఈ బెనిఫిట్స్ గురించి మీకు తెలుసా..?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌ను ప్రకటించింది. కేంద్రం తరఫున ఈ పథకాన్ని ప్రకటించింది

Sovereign Gold Bonds | భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావరిన్ గోల్డ్ బాండ్స్ స్కీమ్‌ను ప్రకటించింది. కేంద్రం తరఫున ఈ పథకాన్ని ప్రకటించింది. ఇందులో బంగారాన్ని కొనుగోలు చేసి.. ఇందులో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఈ బంగారంపై పెట్టుబడులు పెట్టి రిటర్స్స్ పొందే వీలుంటుంది. కిలోల చొప్పున బంగారం కొనేందుకు అవకాశం వీలుంటుంది. ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా నాలుగు కిలోల వరకు బంగారం కొనుగోలు చేయవచ్చు. ట్రస్టులు, యూనివర్సిటీలు మాత్రం 20 కిలోల వరకు కొనవచ్చు. వీటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినట్లయితే గ్రాముపై రూ.50 డిస్కౌంట్‌ను పొందే వీలుంటుంది.
తులానికి రూ.500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. గోల్డ్ బాండ్ల సిరీస్ ఇష్యూ చేసిన ముందటి వారం చివరి మూడురోజుల సగటు ధర ఆధారంగా బంగారం రేటు ఆర్బీఐ ఇష్యూ చేస్తుంది. దీని ప్రకారం బంగారం కొనాల్సి ఉంటుంది. ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA) ధర నిర్ణయిస్తుంటుంది. ఈ బాండ్ల కాలపరిమితి ఎనిమిది సంవత్సరాలుగా ఉంటుంది.. ఆ తర్వాత మళ్లీ ఐబీజేఎం ధర నిర్ణయించి.. అప్పటికి ఉన్న గోల్డ్ రేట్‌ను బట్టి చెల్లిస్తుంది. ఇంకా వడ్డీ సైతం ఉంటుంది.
ఇంకా ఈ పథకంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో పరిశీలిస్తే.. గోల్డ్ మార్కెట్ ట్రెండ్స్‌ను బట్టి రిటర్న్స్ లభిస్తాయి. బంగారం ధర రాబోయే రోజుల్లో పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని బట్టి ఎనిమిదేళ్ల తర్వాత రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ఏడాదికి బంగారంపై 2.50 శాతం చొప్పున వడ్డీ రేటు వర్తిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత వచ్చే రిటర్న్స్ లాభాలపై ఎలాంటి పన్ను చెల్లించాల్సి అవసరం ఉండదు. ఫిజికల్ గోల్డ్‌కు వర్తించినట్లుగా బంగారంపై ఎలాంటి జీఎస్టీ సైతం ఉండదు.. మేకింగ్ చార్జీలు సైతం ఉండవు.
ఈ బంగారం పూర్తి సురక్షితం.. ఇందులో ఎలాంటి రిస్క్ సైతం ఉండబోదు. బయట బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో దొంగలు పడి ఎత్తుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కానీ ఈ పథకంలో అలాంటి భయమేమీ ఉండదు. గోల్డ్ బాండ్ స్కీమ్‌కు కేంద్ర ప్రభుత్వ మద్దతుగా ఉంటుంది. అందుకే గ్యారంటీ రిటర్న్స్ ఆశించేందుకు వీలుంటుంది. కాలపరిమితి 8 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ.. ఐదేళ్ల తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి పథకం నుంచి వైదొలిగేందుకు వీలుంటుంది.