Special Trains | షిర్డీ సాయిభక్తులకు గుడ్‌న్యూస్.. మూడు స్పెషల్ ట్రైన్లను నడుపనున్న దక్షిణ మధ్య రైల్వే..!
Special Trains | షిర్డీ సాయిబాబా భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఆరు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్-నాగర్‌సోల్ రైలు (07517) ను ఈ నెల 14, 21, 28 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఆయా రోజుల్లో రైలు సాయంత్రం 5 గంటలకు బయలు దేరి.. మరుసట రోజు ఉదయం 8 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది. నాగర్‌సోల్ - సికింద్రాబాద్ రైలు (07518) నాగర్‌సోల్ -సికింద్రాబాద్ రైలును 15, […]
Special Trains | షిర్డీ సాయిబాబా భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. ఆరు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది.
సికింద్రాబాద్-నాగర్‌సోల్ రైలు (07517) ను ఈ నెల 14, 21, 28 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఆయా రోజుల్లో రైలు సాయంత్రం 5 గంటలకు బయలు దేరి.. మరుసట రోజు ఉదయం 8 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది.
నాగర్‌సోల్ – సికింద్రాబాద్ రైలు (07518) నాగర్‌సోల్ -సికింద్రాబాద్ రైలును 15, 22, 29 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన తెలిపింది.
ఆయా రైళ్లు మూడు తేదీల్లో రాత్రి 22 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 10.50 గంటలకు గమ్యస్థానానికి చేరనున్నది.
ఆయా రైళ్లు రెండు మార్గాల్లో లింగంపల్లి, శంకర్‌పల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, ఊద్గిర్, గంగఖేర్, పర్భణి, జాల్నా, ఔరంగాబాద్, రేటెగావ్ తదితర స్టేషన్లలో ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
రైళ్లలో ఏసీ-2 టైర్, ఏసీ-3 టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని వివరించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram