Sruthi Hassan | న‌ల్ల‌త్రాచులా బుస‌లు.. శృతి హాస‌న్ అందంతో మ‌త్తెక్కిపోతున్న కుర్ర‌కారు

Sruthi Hassan | క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాసన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్న శృతి హాస‌న్ ఆ త‌ర్వాత విజృంభించింది. వ‌రుస హిట్స్ అందుకుంటూ ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్రని చెరిపేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు. అమ్మ‌డి ఖాతాలో వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. […]

  • By: sn    latest    Sep 11, 2023 2:55 AM IST
Sruthi Hassan | న‌ల్ల‌త్రాచులా బుస‌లు.. శృతి హాస‌న్ అందంతో మ‌త్తెక్కిపోతున్న కుర్ర‌కారు

Sruthi Hassan |

క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాసన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో తొలి హిట్ అందుకున్న శృతి హాస‌న్ ఆ త‌ర్వాత విజృంభించింది. వ‌రుస హిట్స్ అందుకుంటూ ప్రేక్ష‌కుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్రని చెరిపేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

అమ్మ‌డి ఖాతాలో వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. బ‌లుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలతో మంచి విజ‌యాన్ని అందుకోవ‌డంతో పాటు ఆమె ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి. మొద‌ట విదేశి వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్న శృతి హాస‌న్ ఆయ‌న‌తో కొన్నాళ్ల‌పాటు ప్రేమ‌లో మునిగి తేలింది.

విదేశీ వ్య‌క్తితో ప్రేమ‌లో ఉన్న స‌మయంలో శృతి హాస‌న్ సినిమాలు కూడా మానేసింది. అత‌నితో ఎప్పుడు బ్రేక‌ప్ చెప్పిందో అప్పటి నుండి సినిమాలు చేయ‌డం మొద‌లు పెట్టింది. ప్ర‌స్తుతం ఆమె పాన్ ఇండియా చిత్రాల‌తో పాటు సీనియ‌ర్ హీరోల సినిమాలు కూడా చేస్తూ బిజీగా ఉంది.

ప్ర‌స్తుతం ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మొద‌ట్లో వీర‌సింహారెడ్డి, వాల్తేరు వీర‌య్య చిత్రాల‌తో మంచి విజ‌యాల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇక సోష‌ల్ మీడియాలోను తెగ సంద‌డి చేస్తూ ఉంటుంది.

తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ సర్ప్రైజ్ చేసింది. జి క్యూ ఇండియా ఫ్యాషన్ షో కోసం తన ప్రియుడితో కలసి ఫోజులు ఇచ్చింది. కవ్వించే విధంగా శృతి హాసన్ ఇస్తున్న హావభావాలు యూత్ మ‌తులు పోగొడుతున్నాయి.

బ్లాక్ డ్రెస్ లో బుసలు కొట్టే నల్లత్రాచులా శృతి ఇస్తున్న ఫోజులకి ప్ర‌తి ఒక్క‌రు తెగ ఫిదా అవుతున్నారు. శృతి అందం ఈ డ్రెస్‌లో మ‌రింత రెట్టింపు అయిందని కొంద‌రు కామెంట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం శృతి హ‌సన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంత‌నుతో తెగ ప్రేమ‌లో ఉంది. ఎక్క‌డికి వెళ్లిన కూడా అత‌నితో తెగ చ‌క్క‌ర్లు కొడుతూ ర‌చ్చ చేస్తుంది.