పది మంది రాష్ట్ర అధికారులకు IAS హోదా.. ఆమోదించిన DOPT
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్(CS) విధాత: రాష్ట్ర సర్వీస్‌కు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ (IAS) హోదా లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సర్వీస్‌లో వివిధ హోదాల్లో పని చేసిన గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడానికి డీవోపీటీ (DOPT) అవకాశం కల్పించింది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఐఏఎస్ హోదాకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం షార్ట్ లిస్ట్‌ను […]

- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్(CS)
విధాత: రాష్ట్ర సర్వీస్‌కు చెందిన 10 మంది అధికారులకు ఐఏఎస్ (IAS) హోదా లభించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర సర్వీస్‌లో వివిధ హోదాల్లో పని చేసిన గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్ హోదా కల్పించడానికి డీవోపీటీ (DOPT) అవకాశం కల్పించింది. డీవోపీటీ ఆదేశాల మేరకు ఐఏఎస్ హోదాకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం షార్ట్ లిస్ట్‌ను డీవోపీటీకి పంపింది.
డీవోపీటీ అధికారులు జాబితాలో ఉన్న అధికారులకు ఇంటర్యూలు నిర్వహించి, తుది జాబితాను రూపొందించారు. డీవోపీటీ సెలెక్ట్ చేసి, ఐఏఎస్ హోదా కల్పించిన అధికారులను ధృవీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ అధికారులంతా 2023 ఫిబ్రవరి16 నుంచి ఐఏఎస్ అధికారులుగా సర్వీస్‌లో ఉన్నట్లు తెలిపింది.
ఐఏఎస్ హోదా పొందిన వారి జాబితా |
||
క్రమ.స |
అధికారి పేరు |
పోస్టింగ్ |
1 | ఎ.నిర్మల క్రాంతి వెస్లీ (ఎస్‌సీఎస్) | క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ ఎండీ |
2 | కోట శ్రీవాత్సవ | అడిషనల్ కలెక్టర్, వరంగల్ |
3 | చంద్రశేఖర్ బడుగు | అడిషనల్ కలెక్టర్, నిజామాబాద్ |
4 | చెక్క ప్రియాంక | సీఈఓ జిల్లా పరిషత్. కరీంనగర్ |
5 | జల్ద అరుణ శ్రీ | అటాచ్డ్ జీఏడీ |
6 | కె.హరిత (ఎన్ ఎస్ సీఎస్) | అడిషనల్ కమిషనర్(ఎస్‌టీ), పంజాగుట్ట డివిజన్ |
7 | కె. అశోక్‌రెడ్డి | ఫైనాన్స్ మినిస్టర్ ప్రైవేట్ సెక్రటరీ |
8 | పి. కాత్యాయని దేవి | పురపాలకశాఖ మంత్రి ఓఎస్డీ |
9 | ఈవీ నర్సింహారెడ్డి | టీఎస్ ఐఐసీ వీసీ అండ్ ఎండీ |
10 | డాక్టర్ నవీన్ నికొలస్ | అటాచ్డ్ జీఏడీ |